పెళ్లి కొడుకుని చూసి వధువు షాక్.. అమ్మాయి ఎంచేసిందో తెలుసా ??

పెళ్లి కొడుకుని చూసి వధువు షాక్.. అమ్మాయి ఎంచేసిందో తెలుసా ??

Phani CH

|

Updated on: Dec 16, 2022 | 9:21 AM

దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితిలో.. సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక రకాల వీడియోలు ఓ రేంజ్ లో హల్‌చల్ చేస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితిలో.. సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక రకాల వీడియోలు ఓ రేంజ్ లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అన్ని పెళ్లిళ్ల వీడియోల కంటే కొంచెం భిన్నంగా ఉంది. ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఆలోచనలో పడాల్సిందే.. పెళ్లి అనేది ప్రతి అమ్మాయికి ఓ అందమైన కల. చాలా మంది కలలు నిజ జీవితంలో కల్లలుగానే మారతాయి. కొంతమంది జీవితంలో పెళ్లి అనేది ఒక శాపంగా మారుతుంది. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు పేదరికంతో నిస్సహాయంగా తమ కూతురిని ఎవరొకరిని ఇచ్చి పెళ్లి చేసి.. తమ భారాన్ని తగ్గించుకోవడం మంచిదని భావిస్తారు. అయితే ఇలాంటి తల్లిదండ్రులకు పెళ్లి విషయంపై అవగాహన కల్పించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. వధువు సంప్రదాయంగా ఎర్రటి దుస్తులను ధరించి పెళ్లి వేదికపైకి వచ్చింది. పెళ్లి వేదిక వద్ద ఉన్న వరుడిని చూడగానే ఆ యువతి షాక్ అయ్యింది. కోపంతో ఊగిపోతూ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. బంధుమిత్రులు సర్ధి చెప్పినా.. వధువు పెళ్లి చేసుకోవడానికి అస్సలు అంగీకరింలేదు. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో సంఘటన నిజంగా జరిగింది కాదు.. ఇది పేద తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి రూపొందించిన నాటకం మాత్రమే. ఈ వీడియోను ఓ వ్యక్తి తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టార్ రైటర్ ఇజ్జత్ తీసేలా ట్వీట్.. దెబ్బకు దండం పెట్టిన RGV

Allu Arjun: ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్

Ravi Teja: స్టార్ హీరో కారణంగా.. భారీగా నష్టపోయిన రవితేజ !!

Shruti Haasan: దిక్కు మొక్కు లేనోళ్లకు శ్రుతి హాసనే దిక్కు !!

Deepika Padukone: దీపిక బికినీ రంగుపై బీజేపీ నేతల ఆగ్రహం !!

 

Published on: Dec 16, 2022 09:21 AM