Huge Tunnel: రెండు దేశాల మధ్య భారీ సొరంగం.. లోపలకి వెళ్లి అధికారులు షాక్‌..!

|

Jun 19, 2022 | 9:12 AM

అమెరికా, మెక్సికో సరిహద్దులో భారీ సొరంగం బయటపడింది. అందులోకి వెళ్లి చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఈ సొరంగంలో ఓ రైల్వే లైన్, అందుకోసం విద్యుత్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కనుగొన్నారు.


అమెరికా, మెక్సికో సరిహద్దులో భారీ సొరంగం బయటపడింది. అందులోకి వెళ్లి చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఈ సొరంగంలో ఓ రైల్వే లైన్, అందుకోసం విద్యుత్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కనుగొన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం నేరస్థులు ఈ సొరంగాన్ని సిద్ధం చేసినట్లు అధికారులు కనుగొన్నారు. డెయిలీ మెయిల్‌ నివేదిక ప్రకారం, స్మగ్లింగ్ కోసం ఉపయోగించే ఈ సొరంగాన్ని యూఎస్ అధికారులు కనుగొన్నారు. ఇది మెక్సికోలోని టిజువానా, అమెరికాలోని శాన్ డియాగో మధ్య ఉంది. ఇది 1,744 అడుగుల పొడవు, 61 అడుగుల లోతు కలిగి ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించిన ఏజెంట్లు ప్రకటించారు. రెండు దశాబ్దాలలో డజనుకు పైగా సొరంగాలను ఇదే ప్రాంతంలో కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ సొరంగం ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎప్పటి నుంచి జరుగుతుందో తెలపలేదు. ఈ దాడుల్లో 799 కిలోల కొకైన్, 75 కిలోల మెత్, 1 కిలో 600 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సాయుధ గార్డు ఒకరు ఇద్దరు అనుమానితులను ఆ సొరంగం ప్రాంతంలో గమనించి, అనుమానంతో అక్కడ తనిఖీలు చేయగా ఈ సొరంగం బయటపడినట్లు యుఎస్ అటార్నీ రాండీ గ్రాస్‌మన్ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on