fun in cricket: లైవ్ మ్యాచ్‌లో హై డ్రామా.. పొదల్లోకి దూరి ఆటగాళ్లు ఏం చేశారో తెలుసా.?
ఇంగ్లండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాడు మలాన్ కొట్టిన ఓ సిక్సర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో అద్భుతమైన డ్రామాగా మారింది.
ఇంగ్లండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాడు మలాన్ కొట్టిన ఓ సిక్సర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో అద్భుతమైన డ్రామాగా మారింది. ఈ సిక్స్ తర్వాత బంతి కనిపించకుండా పోయింది. నెదర్లాండ్స్ ఆటగాళ్ళు మ్యాచ్ నుంచి బయటకు వెళ్లి పొదల్లో బంతి కోసం వెతుకుతూ కనిపించారు.కేవలం ఒక పరుగుకే జాసన్ రాయ్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్ మలాన్, ఫిలిప్ సాల్ట్ వేగంగా పరుగులు జోడించారు. వీరిద్దరూ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. డేవిడ్ మలన్ తన అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, మలాన్ కొట్టిన ఓ సిక్స్ తర్వాత బంతి కనిపించకుండా పోయింది. నెదర్లాండ్స్ ఆటగాళ్ళు మ్యాచ్ నుంచి బయటకు వెళ్లి పొదల్లో బంతి కోసం వెతుకుతూ కనిపించారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..