మృత్యువు ముంగిట 14 వేల మంది చిన్నారులు వీడియో
ఇజ్రాయిల్, గజా మధ్య వివాదం ఇప్పటిలో చల్లారాలా లేదు. ఇజ్రాయిల్ తగ్గేదే లే అంటూ గజాపై దాడులను కంటిన్యూ చేస్తుంది. ఇప్పటికే వేల మంది చనిపోయారు. రెండు రోజుల క్రితం గజా వ్యాప్తంగా వైమానిక దాడులు చేయడంతో వంద మందికి పైగా మరణించినట్లు గజా అధికారులు తెలిపారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై అర్థరాత్రి వేళ వైమానిక దాడులు చేసింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
పదుల సంఖ్యలో క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇజ్రాయిల్ భీకర దాడులతో గజాలలో పరిస్థితులు పూర్తిగా మారాయి. అక్కడ ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే గజాను అన్ని వైపులా నిర్బంధించిన ఇజ్రాయిల్ పరిమిత స్థాయిలో మాత్రమే మానవతా సాయానికి అనుమతిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిపై స్పందించిన ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా సాయం అందకుండా చేస్తే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మరణించే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది. 14 వారాల క్రితం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయిల్ నిర్బంధించింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యుకె ఒత్తిడి చేయడంతో పరిమిత స్థాయిలో గజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయిల్ అనుమతిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం
చిరుత పులిని వెంటపడి తరిమిన కుక్కలు వీడియో
సినిమాలో లెక్కనే వివాహ విందులో మహిళ రచ్చ రంబోలా వీడియో
షార్ట్ సర్క్యూట్ జరగకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే : రిటైర్డ్ ADE తుల్జా రామ్ సింగ్ వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
