నేను కనుసైగ చేస్తే చాలు..రెండు నిమిషాల్లో అంతా ఖతం
ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం ఉల్లంఘనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనుకుంటే.. గాజాలో ఖాళీ చేయించిన ప్రాంతాల్లోకి తిరిగి వెళ్లి హమాస్‌ను అంతం చేయమని ఇజ్రాయెల్‌ను కోరతానని వార్నింగ్ ఇచ్చారు. హమాస్‌తో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం చాలా గొప్పదన్నారు ట్రంప్.
ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని లేకుంటే ఖతం చేస్తామని హమాస్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హింస తగ్గుతుందనే ఆశతో తాను కాల్పుల విరమణ ఒప్పందం చేయించానని చెప్పారు. నిరంతర దాడులకు పాల్పడుతూ ఉంటే సహించేది లేదన్నారు. నేను చెప్పినా వినకుండా హింసను కొనసాగిస్తే ఇజ్రాయెల్ రియాక్షన్ కూడా చాలా హింసాత్మకంగా ఉంటుందన్నారు. నేను కనుసైగ చేస్తే హమాస్‌ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్‌కు రెండు నిమిషాలు చాలని ట్రంప్ అన్నారు. కానీ, ప్రస్తుతం తాను అలా చేయడం లేదని తెలిపారు. ఇదిలాఉండగా..ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య మరోసారి దాడులు జరిగాయి. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నారనే విషయంలో హమాస్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. హమాస్ మిలిటెంట్లు తమ సైనికులపై కాల్పులు జరిపారంటూ.. ఇజ్రాయెల్ రఫా నగరంపై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు గాజాలోకి వచ్చే మానవతా సాయాన్ని నిలిపివేస్తున్నట్లు కూడా టెల్‌అవీవ్ ప్రకటించింది. తమ దళాలపై హమాస్ దాడులు చేస్తే అది భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నెతన్యాహు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ భారీ ఊరట.. లక్ష డాలర్ల ఫీజుపై మినహాయింపు
బైక్‌లో పెట్రోల్ కొట్టించుకున్నాడు.. అర కిలోమీటరు వెళ్లగానే
రైల్వే స్టేషన్లో ఏదైనా కొంటున్నారా ?? ఇలా కాలర్ పట్టుకుంటారు జాగ్రత్త
మోనాలిసా కొలువైన మ్యూజియంలో.. మహా దోపిడీ
మర్యాదగా ఒప్పుకో.. లేదంటే లేపేస్తాడు జెలెన్ స్కీకి ట్రంప్ వార్నింగ్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

