36,000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న ఆ వస్తువేంటి ??
గాల్లో 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అంతుచిక్కని వస్తువు ఒకటి అత్యంత వేగంగా ఢీకొట్టడంతో విమానం కాక్‌పిట్ ముందు ఉండే విండ్ షీల్డ్ పగిలిపోయింది. కాక్‌పిట్‌లో తీవ్ర ఆందోళన నెలకొన్నా, పైలట్లు సమర్థంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు.
అమెరికాలో గత గురువారం ఈ షాకింగ్ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం డెన్వర్ నుంచి లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరింది. విమానం 36 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక, ఓ భారీ శబ్దంతో కాక్‌పిట్ అద్దం పగిలింది. పగిలిన గాజు ముక్కలు కాక్‌పిట్ డ్యాష్‌బోర్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఓ పైలట్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన పైలట్లు, విమానాన్ని కిందికి దించి సాల్ట్ లేక్ సిటీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలోని ప్రయాణికులెవరూ గాయపడలేదు వారంతా సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికుల కోసం వెంటనే మరో విమానాన్ని ఏర్పాటు చేసి వారి గమ్యస్థానమైన లాస్ ఏంజిల్స్‌కు పంపింది విమానయాన సంస్థ. సాధారణంగా ఇంత ఎత్తులో పక్షులు గానీ, వాతావరణంలోని ఇతర వస్తువులు గానీ విమానాలను ఢీకొట్టే అవకాశం ఉండదు. దీంతో ఈ ప్రమాదానికి అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన వ్యర్థాలు లేదా చిన్న ఉల్క కారణమై ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అద్దం పగిలిన చోట కాలిన గుర్తులు ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. స్పేస్ డెబ్రిస్ వల్ల విమానాలకు ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గతంలోనే స్పష్టం చేసింది. ప్రస్తుతం భూమి చుట్టూ 4 అంగుళాల కన్నా పెద్దవైన సుమారు 25,000 అంతరిక్ష వ్యర్థాలను నాసా ట్రాక్ చేస్తోంది. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేను కనుసైగ చేస్తే చాలు..రెండు నిమిషాల్లో అంతా ఖతం
విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ భారీ ఊరట.. లక్ష డాలర్ల ఫీజుపై మినహాయింపు
బైక్‌లో పెట్రోల్ కొట్టించుకున్నాడు.. అర కిలోమీటరు వెళ్లగానే
రైల్వే స్టేషన్లో ఏదైనా కొంటున్నారా ?? ఇలా కాలర్ పట్టుకుంటారు జాగ్రత్త
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

