బాక్స్‌లు విసిరికొట్టిన ఉద్యోగులు.. సోన్ పాపడీ మాకొద్దంటూ..
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతులు ఇచ్చి వారిని సంతోషపెట్టడం సాధారణం. అయితే దీపావళి కానుకల విషయంలో ఉద్యోగుల ఆలోచనాధోరణి ఎంతగా మారిందో హర్యానా లో జరిగిన ఓ ఘటన కళ్లకు కట్టింది. తమ కంపెనీ ఇచ్చిన దీపావళి బహుమతి పట్ల అసంతృప్తి చెందిన ఉద్యోగులు ఏకంగా ఆ బహుమతి డబ్బాలను కంపెనీ గేటు వద్దే విసిరిపారేసిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హర్యానా రాష్ట్రం గన్నౌర్ పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. దీపావళి సందర్భంగా యాజమాన్యం తమ సిబ్బందికి ‘సోన్ పాపిడి’ డబ్బాలను అందించింది. సాధారణంగా దీపావళి బోనస్ లేదా విలువైన గిఫ్ట్‌లను ఆశించిన ఉద్యోగులకు ఈ బహుమతి నిరాశకు గురిచేసింది. బోనస్ ఇవ్వకుండా కేవలం సోన్ పాపిడి డబ్బా ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన ఉద్యోగులు.. ఆ స్వీట్ ప్యాకెట్‌లను పట్టుకుని వచ్చి కంపెనీ గేటు ముందు పడేశారు. బోనస్‌కు బదులు సోన్ పాపిడి ఇచ్చారు అంటూ ఉద్యోగులు నిరసన తెలిపినట్లు సమాచారం. భారతీయ కంపెనీల్లో దీపావళి బహుమతులుగా స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం ఒక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, ఈ రోజుల్లో ఉద్యోగులు ఈ పద్ధతి పట్ల పెద్దగా మొగ్గు చూపడం లేదు. హర్యానా ఘటన ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా నిలిచింది. పండుగ సందర్భంగా ఖర్చుల కోసం గానీ, తమ అవసరాలకు తగ్గట్టుగా గానీ నగదు రూపంలో బోనస్ లేదా ఆన్‌లైన్ గిఫ్ట్ కార్డులను ఇవ్వాలని ఉద్యోగులు కోరుకుంటున్నట్లు ఓ సర్వేలో తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
36,000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న ఆ వస్తువేంటి ??
నేను కనుసైగ చేస్తే చాలు..రెండు నిమిషాల్లో అంతా ఖతం
విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ భారీ ఊరట.. లక్ష డాలర్ల ఫీజుపై మినహాయింపు
బైక్‌లో పెట్రోల్ కొట్టించుకున్నాడు.. అర కిలోమీటరు వెళ్లగానే
రైల్వే స్టేషన్లో ఏదైనా కొంటున్నారా ?? ఇలా కాలర్ పట్టుకుంటారు జాగ్రత్త
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

