చైనా Vs తైవాన్ వీడియో

Updated on: Dec 30, 2025 | 5:55 PM

తైవాన్ చుట్టూ చైనా "జస్ట్ మిషన్-2025" పేరిట భారీ లైవ్ ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇది స్వాతంత్ర వాదులకు బీజింగ్ హెచ్చరిక. తైవాన్ కూడా అప్రమత్తమై, HIMARS రాకెట్లను మోహరించింది. అమెరికా, జపాన్ మద్దతుతో, తైవాన్ తన భద్రతను బలోపేతం చేసుకుంటుంది. చారిత్రక కారణాలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఈ ఉద్రిక్తతలకు కారణం.

తైవాన్ చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చైనా సైన్యం “జస్ట్ మిషన్-2025” పేరుతో తైవాన్‌ను లక్ష్యంగా చేసుకొని భారీ లైవ్ ఫైర్ యుద్ధ విన్యాసాలు ప్రారంభించింది. వాయుసేన, నౌకాదళం, రాకెట్ లాంచర్లతో తైవాన్‌ను చుట్టుముట్టేసింది. ఇది కేవలం డ్రిల్ కాదని, తైవాన్ స్వాతంత్ర వాదులకు, వారికి మద్దతిస్తున్న విదేశీ శక్తులకు బీజింగ్ ఇస్తున్న తీవ్ర హెచ్చరిక అని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో తైవాన్ కూడా అప్రమత్తమై, చైనా దాడిని తిప్పికొట్టేందుకు రాపిడ్ రెస్పాన్స్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. అమెరికా తైవాన్‌కు 11.1 బిలియన్ డాలర్ల ఆయుధ ఒప్పందంతో మద్దతునిచ్చింది. చైనా దాడి చేస్తే జపాన్ కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. చైనా తైవాన్ జలసంధి ఉత్తరం, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో బలగాలను మోహరించి, భూభాగం, సముద్ర లక్ష్యాలపై లైవ్ ఫైరింగ్ నిర్వహిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

ప్రాణం తీసిన సెల్‌ ఫోన్‌ టాకింగ్ వీడియో

సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో