అరబ్ దేశాలకు చైనా ఊహించని షాక్‌.. సముద్రపు నీటితో ఫ్యూయల్‌ తయారీ

Updated on: Dec 13, 2025 | 1:33 PM

ఇంధన ధరల పెరుగుదల, నీటి కొరతకు పరిష్కారంగా చైనా సముద్రపు నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్, స్వచ్ఛమైన తాగునీటిని ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది. షాన్డాంగ్ ప్రావిన్స్‌లో నెలకొల్పిన ఈ ప్లాంట్, సముద్రపు ఉప్పు నీటి సమస్యలను అధిగమించి, భవిష్యత్ ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తూ, త్రాగునీటినీ అందిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ చైనా నుంచి ఓ చల్లని కబురు అందుతోంది. ఇటు ఇంధన ధరలకు, అటు తాగునీటి కొరతకు ఒకేసారి చెక్‌ పెట్టే ప్రయోగం ఫలించినట్లు తెలుస్తోంది. సముద్రపు నీటిని తాగునీటిగా, పెట్రోల్‌గా మార్చే కర్మాగారం చైనా ప్రారంభించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చైనా తూర్పు ప్రావిన్స్ షాన్డాంగ్ లో ఈ విప్లవాత్మక కర్మాగారం ప్రారంభమైనట్లు సమాచారం. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. షాన్డాంగ్ లోని రిజావో నగరంలో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ఇంధనం తయారవుతోందని, ఈ తరహా ఇంధనాన్ని తయారు చేయగల ఏకైక ఫ్యాక్టరీ ప్రపంచం మొత్తంలో ఇదే మొదటిదని చెబుతున్నారు. ఇది పూర్తిగా సముద్రపు నీటితో నడుస్తుంది. దీని నుంచి స్వచ్ఛమైన తాగునీరు తయారవుతోంది. అలాగే, ఇందులోనే గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తున్నారట. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని, స్వచ్ఛమైన ఇంధనమంగా గ్రీన్‌ హైడ్రోజన్‌కు పేరుంది. దీనినే భవిష్యత్ ఇంధనమనీ పిలుస్తున్నారు. గతంలో హైడ్రోజన్‌‌ను ఉత్పత్తి చేయడానికి చాలా విద్యుత్, స్వచ్ఛమైన మంచినీరు అవసరమయ్యేది. ఎందుకంటే..సముద్రంలోని ఉప్పు నీరు యంత్రాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. సముద్రపు నీటిలోని మెగ్నీషియం, కాల్షియం, క్లోరైడ్ అయాన్లు హైడ్రోజన్ ఉత్పత్తి చేసే యంత్రాలను తుప్పు పట్టేలా చేసి బలహీన పరిచేవి. అయితే.. తాజాగా వచ్చిన చైనా కొత్త సాంకేతికత ఈ అడ్డంకిని అధిగమించింది. ఈ ప్లాంట్ నేరుగా సముద్రపు నీటి నుండి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన హైడ్రోజన్ సంవత్సరంలో వంద బస్సులు 3 వేల 800 కిలోమీటర్లు ప్రయాణించడానికి సరిపోతుంది. “ఇది సిలిండర్లను హైడ్రోజన్‌తో నింపడం మాత్రమే కాదు, సముద్రం నుండి శక్తిని సేకరించడానికి ఇది ఒక కొత్త మార్గం” అని సైంటిస్టులంటున్నారు. చైనా చేసిన ఈ ప్రయోగం.. చమురు అమ్మకాల మీద ఆధారపడుతోన్న గల్ఫ్‌ దేశాలను షాక్‌కు గురి చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..

అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..

TTD: భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.. మరింతగా మెరుగుపరిచేందుకు ప్లాన్

ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..

చైనాను భయపెడుతున్న రోబోల విస్తరణ.. చివరికి ఏమవుతుందో