క్రిస్మస్ రోజున విరుచుకుపడిన మెరుపు వరదలు
కాలిఫోర్నియాలో క్రిస్మస్ వేళ 'అట్మాస్ఫిరిక్ రివర్' తుఫాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, మెరుపు వరదలు, బురదచరియలతో కొండ ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. శాన్ డియాగో, సాక్రమెంటోలో మరణాలు సంభవించాయి. గవర్నర్ న్యూసమ్ ఆరు కౌంటీలలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రకృతి విపత్తు కాలిఫోర్నియాలో పెను విషాదాన్ని మిగిల్చింది.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ పర్వదినాన ప్రకృతి విరుచుకుపడింది. పర్వత ప్రాంతాల నుంచి మెరుపు వరద దూసుకొచ్చింది. హిల్ రిసార్ట్ కట్టడాలు వరదలో కొట్టుకుపోయాయి. ప్రాణహాని కలిగే రీతిలో వాతావరణ పరిస్థితులు ఉన్నాయని US వాతావరణ శాఖ హెచ్చరించింది. శాన్‌డియాగోలో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందారు. శాక్రమెంటోలో ఓ పోలీస్ అధికారి దుర్మరణం చెందారు. కాలిఫోర్నియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు గవర్నర్ గెవిన్ న్యూసమ్. లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ప్రజలను వరద ముప్పు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతోనే మెరుపు వరదలు సంభవించినట్లు తెలుస్తోంది. తీవ్రమైన అట్మాస్ఫిరిక్ రివర్ తుఫాను వల్ల భారీ వర్షాలు కురిసి, వరదలు, మడ్‌స్లైడ్స్, డెబ్రిస్ ఫ్లోలు ఏర్పడ్డాయి. ఈ తుఫాను క్రిస్మస్ సెలవుల సమయంలో దక్షిణ కాలిఫోర్నియాలో ప్రధానంగా ప్రభావం చూపింది. ముఖ్యంగా సాన్ బెర్నార్డినో కౌంటీలోని రైట్‌వుడ్ వంటి హిల్ రిసార్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్, మడ్ ఫ్లోలు ఏర్పడి రోడ్లు మూసుకుపోయాయి. డజన్ల కొద్దీ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. పలు వాహనాలు మట్టిలో పూర్తిగా కూరుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక శాన్ డియాగో సిటీ హైట్స్‌లో బలమైన గాలులతో పాటు భారీ చెట్లు కూలాయి. సాక్రమెంటో కౌంటీ షెరిఫ్ ఆఫీసర్ జేమ్స్ కారవాలో రోడ్డుపై కారును నియంత్రించలేక రోడ్డు పక్కనే ఉన్న పవర్ పోల్‌కు ఢీకొట్టి మృతి చెందాడు. అట్మాస్ఫిరిక్ రివర్ తుఫాను కారణంగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ లాస్ ఏంజిల్స్, ఆరెంజ్, రివర్‌సైడ్, శాన్ బెర్నార్డినో, శాన్ డియాగో, శాస్తా కౌంటీల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

