భూమికి చేరిన ఆస్టరాయిడ్‌ బెన్నూ శాంపిల్స్‌

|

Sep 28, 2023 | 10:00 PM

ఆస్టరాయిడ్‌ బెన్నూ శ్యాంపిల్స్ వ‌చ్చేశాయి. అమెరికాలోని ఉటా ప్రాంతంలోని నాసా డిఫెన్స్ సెంట‌ర్‌కు చేరుకున్నాయి. సుమారు 3.8 బిలియ‌న్ల మైళ్ల ప్ర‌యాణం చేసిన ఓసిరిస్ రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి చేరుకుంది. స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన క్యాప్సూల్ నుంచి ఆ గ్ర‌హ‌శ‌క‌ల శ్యాంపిళ్ల‌ను టెస్టింగ్‌కు పంపారు. నాసాకు చెందిన ఓసిరిస్‌-రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా బెన్నూ గ్ర‌హ‌శ‌క‌లానికి చెందిన శ్యాంపిళ్లు భూమికి చేరాయి. బెన్నూ గ్ర‌హ‌శ‌క‌లం నుంచి రాళ్లు, దుమ్ముకు చెందిన శ్యాంపిళ్ల‌ను ప‌ట్టుకువ‌చ్చారు.

ఆస్టరాయిడ్‌ బెన్నూ శ్యాంపిల్స్ వ‌చ్చేశాయి. అమెరికాలోని ఉటా ప్రాంతంలోని నాసా డిఫెన్స్ సెంట‌ర్‌కు చేరుకున్నాయి. సుమారు 3.8 బిలియ‌న్ల మైళ్ల ప్ర‌యాణం చేసిన ఓసిరిస్ రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి చేరుకుంది. స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన క్యాప్సూల్ నుంచి ఆ గ్ర‌హ‌శ‌క‌ల శ్యాంపిళ్ల‌ను టెస్టింగ్‌కు పంపారు. నాసాకు చెందిన ఓసిరిస్‌-రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా బెన్నూ గ్ర‌హ‌శ‌క‌లానికి చెందిన శ్యాంపిళ్లు భూమికి చేరాయి. బెన్నూ గ్ర‌హ‌శ‌క‌లం నుంచి రాళ్లు, దుమ్ముకు చెందిన శ్యాంపిళ్ల‌ను ప‌ట్టుకువ‌చ్చారు. సౌర‌వ్య‌వ‌స్థపై అధ్య‌య‌నం కోసం ఆ గ్ర‌హ‌శ‌క‌లాన్ని స్ట‌డీ చేయ‌నున్నారు. ఓఎస్ఐఆర్ఐఎస్-ఆర్ఈఎక్స్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఏడేళ్ల క్రితం లాంచ్ చేశారు. ఆ స్పేస్‌క్రాఫ్ట్ భూమి నుంచి బెన్నూ ఆస్ట‌రాయిడ్ వ‌ద్ద‌కు వెళ్లి దాని నుంచి శ్యాంపిళ్ల‌ను తీసుకువ‌చ్చింది. స్పేస్‌క్రాఫ్ట్‌ 2016లో నింగిలోకి ఎగిరింది. 2018లో బెన్నూ క‌క్ష్య‌లోకి చేరుకుంది. ఇక 2020లో ఆ గ్ర‌హ‌శ‌క‌లం నుంచి శ్యాంపిళ్ల‌ను సేక‌రించింది. 2021 మేలో మ‌ళ్లీ ఆ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి తిరుగు ప్ర‌యాణం అయ్యింది. అయితే ఈ మిష‌న్ కోసం ఆ స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 3.86 బిలియ‌న్ల మైళ్లు ప్ర‌యాణించింది. బెన్నూ వ‌ర‌కు వెళ్లి అక్క‌డ నుంచి తిరిగి వ‌చ్చేందుకు అంత దూరం ప్ర‌యాణించాల్సి వ‌చ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

114 కేజీల బుద్ధ విగ్రహం చోరీ.. ఒక్కడే ఎత్తుకుపోవడం పై షాకైన పోలీసులు

కుక్క పోస్టర్ జోలికెళ్తే.. చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది

ఆఖరి మజిలీ కోసం.. ఊరు ఊరంతా ఒక్కటైంది

రూ. 830 కోట్ల ఖరీదైన కారులో తిరిగిన యూట్యూబర్