Israel-Hamas war: హమాస్‌ నేత హనియే కుమారుడి మృతి.? గాజాలో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ దళాలు

|

Feb 13, 2024 | 7:34 PM

దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియే కుమారుడు హజెం హనియే మృతి చెందినట్లు తెలుస్తోంది. హజెం ప్రస్తుతం కాలేజీలో ఉన్నట్లు సమాచారం. రఫా నగరంపై ఇజ్రాయెల్‌ దాడులలో కనీసం 44 మంది పాలస్తీనా వాసులు చనిపోయారు. రఫా నగరంలో 14 లక్షల మంది నివసిస్తున్నారని అంచనా. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు ఆదేశించిన కాసేపటికే దాడులు ప్రారంభమయ్యాయి.

దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియే కుమారుడు హజెం హనియే మృతి చెందినట్లు తెలుస్తోంది. హజెం ప్రస్తుతం కాలేజీలో ఉన్నట్లు సమాచారం. రఫా నగరంపై ఇజ్రాయెల్‌ దాడులలో కనీసం 44 మంది పాలస్తీనా వాసులు చనిపోయారు. రఫా నగరంలో 14 లక్షల మంది నివసిస్తున్నారని అంచనా. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు ఆదేశించిన కాసేపటికే దాడులు ప్రారంభమయ్యాయి. గాజాలో దాడులు ప్రారంభమైన తర్వాత లక్షల మంది రఫాకు నిరాశ్రయులుగా వెళ్లి తలదాచుకుంటున్నారు. అక్కడా దాడులు ప్రారంభం కావటంతో సామాన్య పౌరులు కలవరపడుతున్నారు. ఈ దాడులను పలు దేశాలు తప్పుబట్టాయి. రఫా పట్టణంవైపు ఇజ్రాయెల్‌ తన దళాల్ని పంపించినట్లయితే ఆ దేశంతో తమకున్న శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఈజిప్టు హెచ్చరించింది. ఖతార్‌, సౌదీ అరేబియా, మరికొన్ని దేశాలు కూడా ఇలాంటి హెచ్చరికలు చేశాయి.

మరో వైపు యుద్ధంలో తొలిసారిగా.. హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిలో ఇద్దరిని ఇజ్రాయెల్‌ సైన్యం కాపాడింది. రఫాలో ఐడీఎఫ్‌, షిన్‌బెట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ, పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఫెర్నాండో సిమోన్‌ మార్మన్‌, లూయీస్‌ హర్‌ను హమాస్‌ చెర నుంచి కాపాడామనీ వీరిని గతేడాది అక్టోబరు 7న హమాస్‌ ఉగ్రవాదులు కిబుట్జ్‌ నుంచి కిడ్నాప్‌ చేశారని సైన్యం తెలిపింది. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పింది. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ దాదాపు 250 మందిని బంధించింది. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా వీరిలో కొంతమందిని విడుదల చేశారు. ఇంకా 136 మంది హమాస్‌ చెరలో ఉండగా.. వీరిలో ఇద్దరిని ఇజ్రాయెల్‌ కాపాడింది. అయితే, బందీల్లో దాదాపు 30 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..