18 నిమిషాలు.. సముద్రంపై చక్కర్లు కొట్టిన విమానం.. కారణం ఇదే
విమాన సిబ్బంది నిర్వాకంతో ఓ విమానం ఏకంగా 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అదికూడా సముద్రం పైన ఎగురుతుండగా. పారిస్ నుంచి కోర్సికా ద్వీపానికి వెళ్తున్న ఎయిర్‌బస్ విమానానికి ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఇటలీలోని కోర్సికాకు బయల్దేరింది.
ఈ విమానం కోర్సికా రాజధాని అజాక్సియోలోని విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉండగా…. ఆ దిశగా కిందికి దిగుతోంది. కానీ ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ టవర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఆ సమయంలో నైట్‌షిఫ్ట్‌లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది నిద్రపోవడంతో ఎంతకీ ల్యాండింగ్‌కి అనుమతి రాలేదు. దీంతో పైలట్ విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉన్నాడు. ఆ సమయంలో విమానం మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. క్లియరెన్స్ లేకపోవడంతో 18 నిమిషాలు అది చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఏవియేషన్ అధికారులు ధ్రువీకరించారు. అయితే ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారి ద్వారా ఈ నిద్ర విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఏటీసీ అధికారులు విమానం ల్యాండింగ్‌కు సిగ్నల్ ఇవ్వడంతో సురక్షితంగా కిందకు దిగింది. అయితే నిద్రపోయిన అధికారి మద్యం సేవించి ఉంటారా అని పరీక్షించగా అతను మద్యం తీసుకోలేదని తేలింది. అంతేకాదు, విమానం గంటపాటు ఆలస్యం కావడం కూడా ఈ పరిస్థితికి దారితీసిందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెంటాడిన భయం.. దానితో ఇద్దరు మృతి..
జస్ట్ మిస్.. తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ
సీఎం చెప్పారు.. బుల్లెట్ దిగింది! హీరోయిన్‌కి యోగి మార్క్ న్యాయం
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

