జస్ట్ మిస్.. తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ
ఉత్తరాఖండ్‌లో వర్షాలు వరదల ప్రభావం కొనసాగుతోంది. ఈ క్రమంలో గర్‌హ్వాల్ బీజేపీ ఎంపీ అనిల్ బలూనీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఉత్తరాఖండ్‌లో పర్యటనలో ఉన్న ఆయన బద్రీనాథ్ జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎంపీతోపాటు, ఆయన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా విపత్తు ప్రభావిత ప్రాంతాలైన చమోలీ, రుద్రప్రయాగ్‌లో పర్యటించిన అనంతరం బలూనీ .. రిషికేశ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో దేవప్రయాగ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటాన్ని గమనించి.. వెంటనే కారు దిగి, సిబ్బందిని, ఇతరులను అలర్ట్ చేశారు. అయితే.. చూస్తుండగానే అక్కడి పర్వతం నుంచి భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతమంతా బండ రాళ్లు, మట్టితో నిండిపోయింది. దీంతో.. వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ భయానక అనుభవాన్ని బలూనీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్‌లు, కొండచరియలు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తనకు ఎదురైన అనుభవాన్ని బట్టి.. తమ రాష్ట్రం ఎంతటి ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొంటోందో ఈ వీడియో చెబుతోందని పోస్టులో చెప్పుకొచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు. ఉత్తరాఖండ్ వరుస ప్రకృతి విపత్తులతో అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా అనేక జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. గురువారం నందా నగర్‌లోని కుంటారీ, ధుర్మా ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా దాదాపు 10 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీఎం చెప్పారు.. బుల్లెట్ దిగింది! హీరోయిన్‌కి యోగి మార్క్ న్యాయం
మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియోపై ఆర్టీసీ రియాక్షన్
త్వరలోనే భారత్‌లో 6 జీ సేవలు.. హైదరాబాద్ ఐఐటీది కీలక పాత్ర
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

