ఆర్టీసీలో ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే
ఆర్టీసీలో ఉద్యోగం చేయడమే మీ లక్ష్యం అయితే మీకో గుడ్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ నోటిఫికేషన్ ద్వారా 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు అర్హతలు, ఎంపిక విధానం, ఇతర పూర్తి వివరాలు www.tgprb.in అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.
ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు మాత్రమే కాకుండా.. స్థిరమైన భవిష్యత్తు కూడా లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ ఉద్యోగాలకు జీతం రూ.29,960 నుంచి స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఇక శ్రామిక్ పోస్టులకు నెలకు జీతం రూ.16,550 నుంచి రూ.45,030 వరకు ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు. ఉద్యోగార్థులకు శుభవార్త TGSRTC లో 1,743 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసిందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కాగా, ఏడాది క్రితం ఆర్టీసీలో 3080 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏడాది కిందట అనుమతి ఇవ్వగా..అందులో 2 వేల డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అయితే తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో 1000 డ్రైవర్ పోస్టులనే భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే మిగిలిన పోస్టు లభర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు పెద్దఎత్తున ఖాళీలు ఉన్నాయి. కనీసం 2 వేల పోస్టుల భర్తీకి అనుమతించాలని అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: నెట్‌ఫ్లిక్స్ నుంచి మైండ్ షేక్ డీల్
ప్రేమాభిషేకం, డాక్టర్ చక్రవర్తి సినిమాలు రీ-రిలీజ్.. అందరికీ టికెట్స్ ఫ్రీ..
RGVపై దహనం ఎఫెక్ట్.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆమె..!
Deepika Padukone: కల్కి సీక్వెల్ నుంచి దీపిక అవుట్ మరి.. ఆ ఛాన్స్ ఎవరికో ??
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

