Hamas Hostage: ‘ప్లీజ్‌ నన్ను విడిపించండి’.. హమాస్‌ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్‌ యువతి వీడియో బయటకు..!

Hamas Hostage: ‘ప్లీజ్‌ నన్ను విడిపించండి’.. హమాస్‌ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్‌ యువతి వీడియో బయటకు..!

Anil kumar poka

|

Updated on: Oct 19, 2023 | 5:10 PM

హమాస్‌ చెరలో బందీ గా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరురాలికి సంబంధించిన ఓ వీడియో బయటికొచ్చింది. అందులో ఆమె చేతికి తీవ్ర గాయంతో బాధపడుతూ కన్పించింది. హమాస్‌ మిలిటరీ విభాగమైన ఇజ్‌ అద్‌-దిన్‌ అల్‌-కస్సామ్‌ బ్రిగేడ్స్‌ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసింది. వీడియోలో 21 ఏళ్ల ఫ్రాన్స్‌-ఇజ్రాయెల్‌ మహిళ మియా షెమ్‌ చేతికి సర్జరీ జరగ్గా.. ఓ వ్యక్తి ఆమెకు కట్టు కడుతున్నారు.

హమాస్‌ చెరలో బందీ గా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరురాలికి సంబంధించిన ఓ వీడియో బయటికొచ్చింది. అందులో ఆమె చేతికి తీవ్ర గాయంతో బాధపడుతూ కన్పించింది. హమాస్‌ మిలిటరీ విభాగమైన ఇజ్‌ అద్‌-దిన్‌ అల్‌-కస్సామ్‌ బ్రిగేడ్స్‌ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసింది. వీడియోలో 21 ఏళ్ల ఫ్రాన్స్‌-ఇజ్రాయెల్‌ మహిళ మియా షెమ్‌ చేతికి సర్జరీ జరగ్గా.. ఓ వ్యక్తి ఆమెకు కట్టు కడుతున్నారు. ఆ తర్వాత మియా మాట్లాడింది. తనది గాజా సరిహద్దులోని షోహమ్‌ అనే ప్రాంతమని ప్రస్తుతం గాజా లో ఉన్నట్లు చెప్పింది. అక్టోబరు 7న తను సూపర్‌నోవా మ్యూజిక్‌ పార్టీకి వెళ్లిందని, చేతికి తీవ్ర గాయమై గాజాలో మూడు గంటలపాటు సర్జరీ జరిగిందని తెలిపింది. వాళ్లు తనను బాగానే చూసుకుంటున్నారని మందులు ఇస్తున్నారని చెప్పింది. వీలైనంత త్వరగా తనను విడిపించి అమ్మనాన్నల దగ్గరకు తీసుకెళ్లమని మియా ఆ వీడియోలో కోరింది. అయితే తను ఎలా గాయపడిందో మాత్రం మియా చెప్పలేదు. వీడియోను హమాస్‌ మిలిటెంట్లు తమ సొంత టెలిగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. మద్దతుదారులు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. దీనిపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ మాట్లాడుతూ, తమను తాము మానవత్వం ఉన్న మనుషులుగా చిత్రీకరించుకునేందుకే హమాస్‌ ఈ వీడియోను విడుదల చేసిందని, కానీ హమాస్‌ ఓ భయంకరమైన ఉగ్రవాద సంస్థ, అనేక మంది పసిబిడ్డలు, చిన్నారులు, మహిళలు, వృద్ధులను అపహరించి, పలువురిని హత్య చేసిందని తెలిపింది. మియాతో పాటు హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారందరినీ విడిపించేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఐడీఎఫ్‌ తమ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో రాసుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 19, 2023 05:10 PM