Philippines: విరిగిపడిన కొండచరియలు.. 54 మంది సజీవ సమాధి.

|

Feb 13, 2024 | 7:18 PM

పిలిప్పీన్స్‌లోని డావో ప్రావిన్సు మాకో టౌన్‌లో బంగారు గని సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండ చరియల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి. గత వారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

పిలిప్పీన్స్‌లోని డావో ప్రావిన్సు మాకో టౌన్‌లో బంగారు గని సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండ చరియల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి. గత వారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మూడు వందల మందితో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, బురద వల్ల రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ కొండ చరియలు విరిగి పడే అవకాశాలుండటంతో సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. కొండ చరియలు విరిగిపడ్డప్పటి నుంచి మొత్తం 63 మంది ఆజూకీ గల్లంతయింది. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..