Israel: యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు 10 వేల మంది భారతీయ కార్మికులు.

Israel: యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు 10 వేల మంది భారతీయ కార్మికులు.

Anil kumar poka

|

Updated on: Feb 03, 2024 | 6:50 PM

హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌ నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో వచ్చే వారం రోజుల్లో భారత్‌ నుంచి సుమారు 10 వేల మంది కార్మికులు అక్కడికి వెళ్లనున్నారు. విడతలవారీగా వీరు వస్తారని ఇజ్రాయెల్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ వర్గాలు తెలిపాయి. పరస్పర ఘర్షణ వల్ల పాలస్తీనా కార్మికుల ప్రవేశాన్ని ఇజ్రాయెల్‌ నిషేధించింది. యుద్ధం కారణంగా ఇతర దేశాల కార్మికులు సైతం అక్కడినుంచి వెనుదిరిగారు.

హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌ నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో వచ్చే వారం రోజుల్లో భారత్‌ నుంచి సుమారు 10 వేల మంది కార్మికులు అక్కడికి వెళ్లనున్నారు. విడతలవారీగా వీరు వస్తారని ఇజ్రాయెల్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ వర్గాలు తెలిపాయి. పరస్పర ఘర్షణ వల్ల పాలస్తీనా కార్మికుల ప్రవేశాన్ని ఇజ్రాయెల్‌ నిషేధించింది. యుద్ధం కారణంగా ఇతర దేశాల కార్మికులు సైతం అక్కడినుంచి వెనుదిరిగారు. దీంతో ఇజ్రాయెల్‌ నిర్మాణరంగం తీవ్రమైన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు గత డిసెంబరులో భారత ప్రధాని మోదీతో టెలిఫోన్‌ సంభాషణ జరిపారు. భారత్‌ నుంచి కార్మికుల రాక విషయాన్ని వీరు చర్చించారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నారు. యుద్ధ సమయంలోనూ వీరు ఆ దేశం విడిచి వెళ్లలేదు. గతేడాది మే నెలలో ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్‌ ఢిల్లీలో పర్యటించారు. ఆ సందర్భంగా భారత్‌ నుంచి నిర్మాణరంగంలో 34 వేల మంది కార్మికులు, ఆసుపత్రుల్లో మరో 8 వేల మంది సిబ్బంది అక్కడ పనిచేసేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos