2026 బాక్సాఫీస్..సైడ్ తీసుకున్న టాప్ స్టార్స్
2026లో థియేటర్లలో సందడి చేస్తారని అభిమానులు ఎదురుచూసిన పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వరుసగా వాయిదా పడుతున్నాయి. షూటింగ్ ఆలస్యాలు, స్క్రిప్ట్ మార్పులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, గాయాలు వంటి కారణాలతో బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్ చిత్రాలు వచ్చే ఏడాదికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
భారీ అంచనాలు ఉన్న చోట నిరాశ కూడా అదే స్థాయిలో ఉంటుంది. 2026 లో పక్కాగా థియేటర్లలో సందడి చేస్తారని భావించిన అగ్ర హీరోలు ఇప్పుడు ఒక్కొక్కరుగా రేసు నుంచి తప్పుకుంటున్నారు. అసలు ఈ కేలండర్ ఇయర్‌లో బిగ్ స్క్రీన్ సందడి మిస్ అవ్వడానికి కారణాలేంటి? ఎందుకు స్టార్స్ అంతా సైలెంట్ అయిపోయారు? బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్ హీరోల నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి గ్లోబల్ స్టార్ల వరకు అందరూ ఈ ఏడాది థియేటర్లలో కనిపిస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. కానీ రియాలిటీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ముందు నుంచే ప్లాన్ చేసుకున్నా… షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఇప్పుడు వీరంతా 2026ను స్కిప్ చేస్తున్నారు. జెట్ స్పీడుతో సినిమాలు చేసే బాలకృష్ణ, అఖండ 2 తరువాత స్లో అయ్యారు. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టేయటంతో ప్రజెంట్ చేస్తున్న సినిమా విషయంలో కంప్లీట్‌గా యూ టర్న్ తీసుకున్నారు. ఫోక్‌లోర్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టి గ్యాంగస్టర్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది రిలీజ్ అవుతుందని భావించినా.. ఇప్పుడు బాలయ్య గాయం కారణంగా రిలీజ్ విషయంలో అనుమానాలు మొదలయ్యాయి. నాగ్ కూడా వందో సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుండటంతో ఆ మూవీ కూడా ఆలస్యమవుతోంది. ఎన్టీఆర్ నీల్ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రిలీజ్ డేట్ విషయంలో షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఏడాది జూన్‌లో రావాల్సిన ఈ సినిమాను ఏకంగా ఏడాది ఆలస్యంగా 2027 జూన్ 11న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరో వైపు బన్నీ కూడా మరోసారి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు పుష్ప 2 రిలీజ్ తరువాత వరుస సినిమాలు చేస్తానని మాటిచ్చినా… గ్లోబల్ ప్రాజెక్ట్ రాకాను తలకెత్తుకోవటంతో సినిమా ఆలస్యమవుతోంది. దీంతో ఈ సినిమా కూడా ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు ఇలా స్టార్ హీరోలంతా 2026ను స్కిప్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందేభారత్ స్లీపర్ అదుర్స్.. విదేశీ మహిళ ప్రశంసలు
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
ట్రెండ్ మారింది గురూ.. వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

