మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌.. విశాఖలో కూలిన భారీ వృక్షం

Updated on: Oct 28, 2025 | 4:30 PM

విశాఖపట్నంలో మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. గాలుల తీవ్రత పెరగడంతో చెట్లు కూలిపోతున్నాయి. లాసన్స్ బే కాలనీలో ఓ భారీ వృక్షం కూలి, పార్కింగ్‌లో ఉన్న కారును ధ్వంసం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో మరింత తీవ్రత ఉండవచ్చని సూచించారు.

విశాఖపట్నంపై మొంథా తీవ్ర తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గాలుల తీవ్రత విపరీతంగా పెరుగుతుండటంతో నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరుగుతున్నాయి. మొన్న 10 చెట్లు కూలగా, ఈరోజు కూడా కొమ్మలు, చెట్లు పడిపోతూనే ఉన్నాయి. లాసన్స్ బే కాలనీలో పార్కింగ్‌లో ఉన్న ఒక ఫోర్డ్ మెరూన్ కారు (ఏపీ 31ఏఎస్ 4939)పై భారీ వృక్ష కొమ్మ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఉదయం నుంచి భారీ ఎదురుగాలులు, వర్షాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సాయంత్రానికి లేదా రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓడలరేవు దగ్గర సముద్రం కల్లోలం.. ఎగసిపడుతున్న రాకాసి అలలు

కొన్ని విమర్శలు.. కొన్ని పొగడ్తలు షాకింగ్ లుక్‌లో హీరో

కొడాలి నాని.. ఇలా అయిపోయారేంటి ??

మొంథా ఎఫెక్ట్.. ఈ రూట్‌లో నడిచే 97 రైళ్లు రద్దు

బస్సు ప్రమాదాలపై సెలబ్రిటీలు అవగాహన కల్పించాల్సిందే