Viral News: 12 అడుగుల కింగ్‌ కోబ్రా..! ఇప్పటి వరకు చూసి ఉండరు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Viral News: ఎవరికైనా పాము కనిపించిందంటే చాలు భయంతో పరుగులు తీస్తారు. అందులో కింగ్ కోబ్రా అంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ సందర్భంగా..

Viral News: 12 అడుగుల కింగ్‌ కోబ్రా..! ఇప్పటి వరకు చూసి ఉండరు.. సోషల్‌ మీడియాలో వైరల్‌
King Cobra

Updated on: Sep 21, 2021 | 5:53 PM

Viral News: ఎవరికైనా పాము కనిపించిందంటే చాలు భయంతో పరుగులు తీస్తారు. అందులో కింగ్ కోబ్రా అంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన వ్యాపార వేత్త, జోహూ కార్పొరేషన్‌ సీఈవో శ్రీధర్‌ వెంబు ట్వీటర్‌ పోస్టు వైరల్‌ అవుతోంది. రెండు చిత్రాలను ఆయన పోస్టు చేశారు. మిస్టర్‌ వెంబు పోస్టు చేసిన వీడియోలో కింగ్‌ కోబ్రాను అటవీ రేంజర్ల బృందం పట్టుకోవడం చూడవచ్చు. సుమారు 12 అడుగుల పొడవున్న కింగ్‌ కోబ్రాను పట్టుకున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉండే ఈ కింగ్‌ కోబ్రాను ధైర్య సహసాలతో బృందం సభ్యులు దీనిని పట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఇంత భారీగా ఉన్న కింగ్‌కోబ్రాను చూడటం ఇదే మొదటి సారి అని ఆయన చెప్పుకొచ్చారు.  శ్రీధర్‌ వెంబుతో కలిసి అటవీ శాఖ రేంజర్లు ఈ కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. దీంతో వారితో ఫోటో దిగిన ఆయన.. ట్వీటర్‌లో పోస్టు చేశారు.

అటవీ ప్రాంతంలో సందర్శించినప్పుడు ఈ కింగ్‌ కోబ్రా కంట పడింది. దీంతో ఆయన వెంటనే అటవీ రేంజర్లకు సమాచారం అందించారు. వారు చాకచక్యంగా ఆ కింగ్‌ కోబ్రాను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ రేంజర్లు వచ్చిన ఆ కింగ్‌ కోబ్రాను పట్టుకున్నప్పుడు దానిని తాకేందుకు ప్రయత్నించాను. ఇలాంటి దృశ్యాన్ని చూడడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని అన్నారు. ఇలాంటి అద్భుతమైన చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో రకరకాల కామెంట్లు పెట్టారు.

వాస్తవానికి పాములంటేనే చాలా మంది భయపడుతారు. ఇక కింగ్ కోబ్రా అంటే చెప్పనక్కర్లేదు. పొరపాటు దాని కాటు బారిన పడితే క్షణాల్లో ప్రాణాలు వదలాల్సిందే. కానీ, వారు మాత్రం ఏ మాత్రం భయపడకుండా కింగ్ కోబ్రాను పట్టుకోవడం ధైర్య సహసాలతో కూడుకున్నదనే చెప్పాలి.

 

ఇవీ కూడా చదవండి:

Viral Video: కారు ఎక్కేందుకు వెళ్లిన మహిళ.. అది చూసి భయంతో పరుగులు తీసింది.. షాకింగ్ వీడియో మీకోసం..

Viral Video: ఫ్రెండ్‌షిప్‌ అంటే ఈ గుర్రం, మేకలదే గురూ.. మనుషులు సైతం కుళ్లుకునేలా.. వీడియో వైరల్‌