Zaporizhzhia Nuclear Plant: డ్రోన్‌ మంటల్లో ‘జపోరిజియా’ అణు విద్యుత్‌ ప్లాంట్.. ఒకరిపై మరొకరు ఆరోపణలు.

|

Aug 14, 2024 | 12:55 PM

ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఈ ప్లాంట్‌ ఉంది. అయితే ఈ ప్లాంట్‌లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. వారు కీవ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని రష్యా ప్రత్యారోపణలు చేస్తోంది.

ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఈ ప్లాంట్‌ ఉంది. అయితే ఈ ప్లాంట్‌లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. వారు కీవ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని రష్యా ప్రత్యారోపణలు చేస్తోంది. 2022లో రష్యా దళాలు, ఉక్రెయిన్​కు చెందిన జపోరిజియా అణు విద్యుత్​ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నాయి. దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడ విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. మొత్తం ఆ రియాక్టర్లను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కోల్డ్‌ షట్‌డౌన్‌లో ఉంచారు. తాజాగా ఈ ప్లాంట్‌ కూలింగ్‌ టవర్‌పై జరిగిన డ్రోన్‌ దాడిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిపుణులు ఎక్స్‌లో బయటపెట్టారు. రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తొలిసారి రష్యా ప్రధాన భూభాగంలోకి దాదాపు 15 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులు చేసింది. దీంతో రష్యాలోని సరిహద్దు ప్రాంతమైన కస్క్‌ నుంచి ఇప్పటికే అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దాదాపు నాలుగు రోజులుగా రెండు దేశాల మధ్య ఈ ప్రదేశంలోనే భీకరంగా దాడులు జరుగుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on