Crows Attack: ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..

ఈ మధ్య మా అపార్ట్‌మెంట్లో ఎవరు టెర్రస్‌లోకి వెళ్లి కాసేపు కూర్చున్నా.. ఎక్కడ నుంచో వస్తున్న కాకులు కూర్చున్న వారిపై నుంచి వేగంగా దూసుకెళ్తున్నాయి.. ఒక్కోసారి వారిని కాళ్లతో తంతున్నాయి.. గాయపరస్తున్నాయి కూడా. దీంతో అపార్టమెంట్లో ఉన్న వాళ్లంతా టెర్రస్‌పైకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు రాజన్న - సిరిసిల్ల జిల్లాలోని కూడా జరుగుతోంది.

Crows Attack: ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..

|

Updated on: Aug 14, 2024 | 12:47 PM

ఈ మధ్య మా అపార్ట్‌మెంట్లో ఎవరు టెర్రస్‌లోకి వెళ్లి కాసేపు కూర్చున్నా.. ఎక్కడ నుంచో వస్తున్న కాకులు కూర్చున్న వారిపై నుంచి వేగంగా దూసుకెళ్తున్నాయి.. ఒక్కోసారి వారిని కాళ్లతో తంతున్నాయి.. గాయపరస్తున్నాయి కూడా. దీంతో అపార్టమెంట్లో ఉన్న వాళ్లంతా టెర్రస్‌పైకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు రాజన్న – సిరిసిల్ల జిల్లాలోని కూడా జరుగుతోంది. సిరిసిల్ల బస్టాండ్లో కాకులు మనుషులపై ఎటాక్ చేస్తున్నాయి. అటువైపు వెళ్లే వారిని కాళ్లతో కొడుతున్నాయి.అందులోను మగవారే టార్గెట్.. స్త్రీలను ఏమి అనట్లేదు. ఈ సంగతి స్థానికులే చెబుతున్నారు. ఇది నిజంగా వింతగా ఉంది కదా.?

డీటెయిల్స్ లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా కేంద్రం లో బస్టాండ్ నుండి బయటకి వెళ్ళే, లోపలికి వచ్చే మగ వాళ్లను  మాత్రమే తలపై తంతు చెట్టు కొమ్మలపై వాలుతున్నాయి. కట్ట మైసమ్మ గుడి ఆనుకొని ఉన్న వేప చెట్టు పై గూళ్ళు కట్టుకొని పదుల సంఖ్యలో ఉన్న కాకుల గూడు నుండి ఒక కాకి పిల్ల కింద పడిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆ చెట్టు కింద నుంచీ నడుస్తున్న మగ వాళ్లను కాకులు టార్గెట్ చేస్తున్నట్లుగా వారిపై తరచు దాడులు చేస్తున్నాయి. బస్టాండ్ కావడంతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఆటు వైపు వెళ్లడంతో వారిపై దాడి చేస్తున్నాయి. అదేందిరా బాబు ‘కాకి గోల’ అని మనసులో అనుకుంటూ వేగంగా చెట్టు కింది నుండి నడిచి వెళుతున్నారు. తలపై ఒక్కసారిగా దాడి చేయడంతో పాద చారులు ఉలిక్కి పడుతున్నారు. తలపై ఒక్కసారిగా తన్నడానికి వస్తున్న కాకులను చేతులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఏ ప్రాణి అయినా తన సంతానానికి హాని కలుగుతుందని భావిస్తే ఏదో ఒక విధంగా ప్రతిఘటిస్తాయి. అందులో భాగమే ఈ కాకి దాడి అయి ఉండవచ్చన్నది స్థానికుల భావన. అయితే ఇక్కడ కేవలం మగవాళ్ళని ఎటాక్ చేయ్యడం ఇక్కడ వింతగా కనిపిస్తోందని చెబుతున్నారు.

కాకి తంతే ఎం చేయాలి..!

మన దేశంలో న‌మ్మ‌కాలకు కొదవేం లేదు. అందులో కొన్ని మూఢ నమ్మకాలు కూడా ఉన్నాయి. మరి కొన్ని బయటకు మూఢ నమ్మకాలుగా కనిపించినా కాస్త లోతుల్లోకి వెళ్తే అందులో ఏదో ఒక శాస్త్రీయ దృక్పథం కనిపిస్తుంటుంది. అలాంటి వాటిలో కాకి త‌న్నితే అప‌శ‌కునమ‌నే ఓ న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉంది. కాకి త‌ల‌పై త‌న్నితే మ‌ర‌ణ వార్త వింటార‌ని.. ఏడేళ్ల పాటు శని తాండ‌విస్తుంద‌ని కూడా న‌మ్ముతుంటారు. అయితే ఇది చూసేందుకు మూఢ నమ్మకంలా కనిపించినా దీన్ని కాస్త లోతుగా ఆలోచిస్తే అందులోని శాస్త్రీయ దృక్పథం కనిపిస్తుంది. సాధారణంగా కాకి గోళ్లు చాలా ప‌దునుగా ఉంటాయి. కాబ‌ట్టి వేగంగా ఎగురుతూ వ‌చ్చి త‌ల‌పై త‌న్నితే గోళ్లు గుచ్చుకునే ప్ర‌మాదం ఉంటుంది.

అయితే కాకులు స‌హ‌జంగా ఆహార అన్వేష‌ణ‌లో భాగంగా ఎలుక‌లను, చ‌నిపోయిన కోళ్లను, జంతువుల‌ను కాలి గోళ్ల‌తో పీక్కుతింటాయి. దీనివ‌ల్ల కుళ్లి పోయిన జంతువుల వ్య‌ర్థాలు కాకి కాలి గోళ్ల‌లో ఉండిపోతాయి. ఈ క్ర‌మంలో త‌ల‌పై త‌న్నిన స‌మ‌యంలో కుళ్లిపోయిన వ్య‌ర్థాల్లో ఉండే క్రిములు మాన‌వ శ‌రీరంలోకి ప్ర‌వేశించే ప్ర‌మాదం ఉంటుంది. అయితే పూర్వం రోజుల్లో స‌రైన వైద్య స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్ర‌వేశించ‌డంత‌తో మ‌ర‌ణాల‌కు దారి తీసేది. దీంతో కాకి తంతే మ‌ర‌ణం సంభ‌విస్తుంద‌నే న‌మ్మ‌కం బ‌లంగా ఉండిపోయింది. అంతే కాకుండా కాకి త‌ల‌పై త‌న్నితే త‌ల స్నానం చేయాల‌ని చెబుతుంటారు. దీనివ‌ల్ల త‌ల‌పై ఏమైనా క్రిములు చేరితో తొలిగిపోతాయ‌న్నది ఆ మాటల్లో ఉద్ధేశం. ఈ విషయాన్ని ఇంతగా వివరించి చెప్పేంత జ్ఞానం ఉన్నప్పటికీ అర్థం చేసుకునే పరిస్థితులు ఉండకపోవడం వల్ల ఇలా ఏదో ఒక నమ్మకం రూపంలో ఒకరి నుంచి ఒకరికి ప్రచారమవుతూ వచ్చింది. కాకి విషయంలో కూడా అలాగే చెప్పి ఉంటారు. కాకి తంతే అపశకనం అన్న మాటకు అసలు అర్థం అదే అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం మాత్రం దాన్ని అపశకునం అన్న విషయాన్ని పక్కనపెట్టి ఏ గాయం కాకపోతే వెంటనే తలకు స్నానం చేసి శుభ్రపరచుకోవడమో లేదా… గాయమైతే వెంటనే వైద్యుల్ని సంప్రదించడమో చెయ్యాలి. ఆ.. చెప్పడం మర్చిపోయాను.. మా అపార్ట్మెంట్‌లో ఎందుకిలా జరుగుతోందా అని జాగ్రత్తగా గమనిస్తే.. మా గార్డెన్లో ఉన్న ఓ చెట్టుపై కాకులు గూళ్లు పెట్టాయి. అది మా టెర్రస్‌కి దగ్గరగానే ఉంటుంది. సో.. ఆ చెట్టువైపు మనషులు వెళ్ల కూడా అవి కాపలా కాస్తున్నాయన్న సంగతి ఆ తర్వాత మాకు తెలిసింది. దీంతో కొన్ని రోజులు ఆ చెట్టుకు దూరంగా ఉన్నాం.

సో.. అది సంగతి. ఇప్పుడు సిరిసిల్లలోనే కాదు.. ఎక్కడైనా సరే ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం బెటర్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం