మెట్రో ట్రైన్‌లో ఇదేం పని.. డోర్‌కు కాలు అడ్డంగా పెట్టి !!

| Edited By: Ravi Kiran

Jun 15, 2023 | 10:18 AM

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు కొందరు వింత చేష్టలకు దిగుతున్నారు. రోడ్డుపై వాహనం నడుపుతుండగా కారుపై పుషప్‌లు చేయడం, డోర్‌కు వేలాడుతూ నిలబడటం, బైక్‌పై వెళ్తూ అసభ్యకర పనులు చేయడం సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇటీవల మెట్రో రైలులో యువకులు చేసిన చర్య..

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు కొందరు వింత చేష్టలకు దిగుతున్నారు. రోడ్డుపై వాహనం నడుపుతుండగా కారుపై పుషప్‌లు చేయడం, డోర్‌కు వేలాడుతూ నిలబడటం, బైక్‌పై వెళ్తూ అసభ్యకర పనులు చేయడం సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇటీవల మెట్రో రైలులో యువకులు చేసిన చర్య.. మెట్రో సిబ్బందికి ఆగ్రహం తెప్పించింది. దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో రైళ్ల వినియోగం పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సాంకేతికత సాయంతో మెట్రో రైళ్లలో ప్రజల భద్రత కోసం ఆటోమేటిక్ డోర్లను అమర్చారు. ట్రైన్‌ స్టేషన్‌కు వచ్చిన తర్వాత మాత్రమే ఈ తలుపులు తెరుచుకుంటాయి. అనంతరం అన్ని డోర్లు మూసివేసిన తర్వాత మాత్రమే మెట్రో రైలు బయలుదేరుతుంది. ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువకుడు ట్రైన్‌ డోర్‌ను కాళ్లతో అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనాలు, కాంప్లెక్స్‌లతో లిఫ్ట్‌ మాదిరిగానే ఆటోమేటిక్‌ డోర్‌ సిస్టమ్‌ మెట్రో ట్రైన్‌లోనూ ఉంటుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయడానికి మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు

బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. ఎందుకో తెలుసా ??

Janasena: తెలంగాణలోనూ జనసేన పోటీ.. లక్ష్యమదేన ??

బీచ్‌లో వేలాది చేపలు మృతి.. రీజన్ తెలిస్తే షాక్ !!

 

Published on: Jun 15, 2023 08:15 AM