Tirupati: సింహం పలకరించిందని పరాచికాలు ఆడాడు.. సీన్ కట్ చేస్తే శవమై తేలాడు.!
తిరుపతి శ్రీవెంకటేశ్వర జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి చేసిన సింహాన్ని జంతుప్రదర్శనశాల అధికారులు బోన్‌లో బంధించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కావాలనే ఆ వ్యక్తి లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తిరుపతి శ్రీవెంకటేశ్వర జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి చేసిన సింహాన్ని జంతుప్రదర్శనశాల అధికారులు బోన్‌లో బంధించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కావాలనే ఆ వ్యక్తి లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన 38 ఏళ్ళ ప్రహ్లాద్ గుర్జార్ గా గుర్తించారు. అయితే, ప్రహ్లాద్ సెల్ఫీ కోసం సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు అక్కడున్న వారు చెబుతున్నారు. సెల్ఫీ తీసుకుని సింహం ముందు తొడగొట్టాడు ఆ వ్యక్తి. సింహం కదిలేసరికి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కాసేపటికి అదుపుతప్పి చెట్టుపై నుంచి కిందపడటంతో సింహం ఒక్కసారిగా ప్రహ్లాద్‌పై దాడి చేసింది. అతని శరీరాన్ని చీల్చే చంపేసిందని జూ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం జూ దగ్గర ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. జూలోకి ఎవర్నీ అనుమతించడం లేదు సిబ్బంది. కాగా, ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

