AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youngman dance: అమెరికా వీధుల్లో అమ్మాయిలా భారతీయ యువకుడు.. దుమ్ములేపుతున్న డాన్స్ వీడియో..

Youngman dance: అమెరికా వీధుల్లో అమ్మాయిలా భారతీయ యువకుడు.. దుమ్ములేపుతున్న డాన్స్ వీడియో..

Anil kumar poka
|

Updated on: Jun 18, 2022 | 9:28 AM

Share

మ్యూజిక్ వినిపిస్తే కాలు కదపని వారుండరు. కొన్ని పాటలు వింటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్టెప్పులేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్ అంటూ సూపర్ హిట్ సాంగ్స్ కు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోస్


మ్యూజిక్ వినిపిస్తే కాలు కదపని వారుండరు. కొన్ని పాటలు వింటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్టెప్పులేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్ అంటూ సూపర్ హిట్ సాంగ్స్ కు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా ఓ యువకుడు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ పాటకు అదిరిపోయేలా స్టె్ప్పులేశాడు.. కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు.. అతడి డ్రెస్సింగ్ కూడా అమ్మాయిలాగే ఉండడం విశేషం.. ఈ భారతీయ కుర్రాడు అమెరికా వీధుల్లో అమ్మాయిలా డ్రెస్సింగ్ వేసి అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ చూపరులను కట్టిపడేశాడు. అమ్మాయిలాగా స్కర్ట్, కుర్తా ధరించి స్టెప్పులతో అదరగొట్టాడు. గతంలో ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఫేమస్ సాంగ్ బర్సో రే మేఘా.. మేఘా పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు..మెరూన్ కలర్ స్కర్ట్ ధరించి అమెరికా వీధుల్లో అద్భుతంగా డ్యాన్స్ చేసాడు.. అతని హావాభావాలు సైతం అమ్మాయిల మాదిరిగానే ఇస్తూ ఆకట్టుకున్నాడు. అతని డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోస్ చూసిన నెటిజన్స్ అద్భుతం, సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..

 

Published on: Jun 18, 2022 09:28 AM