Uttarakhand: పెద్ద సూట్​కేసుతో హోటల్​ నుంచి బయటకు.. అనుమానంతో చెక్ చేస్తే.. కళ్లుచెదిరే సీన్..

|

Apr 08, 2022 | 9:35 AM

ఉత్తరాఖండ్​ రూడ్కీ జిల్లా పిరాన్​ కలియార్​ ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. పెళ్లి రిజెక్ట్ చేసిందనే కోపంతో లవర్‌ను హెటల్‌కి తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఆపై శవాన్ని మాయం చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. సూట్​కేసులో కుక్కి నదిలో పడేసేందుకు ట్రై చేశాడు. అయితే


ఉత్తరాఖండ్​ రూడ్కీ జిల్లా పిరాన్​ కలియార్​ ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. పెళ్లి రిజెక్ట్ చేసిందనే కోపంతో లవర్‌ను హెటల్‌కి తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఆపై శవాన్ని మాయం చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. సూట్​కేసులో కుక్కి నదిలో పడేసేందుకు ట్రై చేశాడు. అయితే హోటల్ సిబ్బంది అతడిని పట్టేసుకున్నారు. కానీ నిందితుడు హాటల్‌ సిబ్బందికి ఆమె సూసైడ్ చేసుకుంది అంటూ కాకమ్మ కథ చెప్పాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తేల్చేసారు. పక్కా ప్లాన్‌తో అతడు ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మంగళూరుకు చెందిన రమ్​శా అనే యువతిని.. ఆమె దూరపు బంధువైన సనవార్ అనే యువకుడు లవ్ చేశాడు.​ ఇరువురు కలిసి మార్చి 24 రాత్రి పిరాన్​ కలియార్​ ఏరియాలోని ఓ హోటల్​కు వచ్చారు. కొంత సమయం తర్వాత పెద్ద సూట్​కేసుతో హోటల్​ నుంచి బయటకు వెళ్లేందుకు ట్రై చేశాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన హోటల్ స్టాఫ్, స్థానికులు యువకుడిని పట్టుకున్నారు.సూట్​కేసు తెరిచి చూడగా యువతి డెడ్‌బాడీ ఉండటంతో అందరూ షాక్ తిన్నారు. ఈ క్రమంలో తాము సూసైడ్ చేసుకునేందుకే హోటల్​కు వచ్చామని, ముందుగా తన ప్రేయసి విషం తాగి చనిపోయిందని, తన మృతదేహాన్ని నదిలో పడేసి ఆ తర్వాత తానూ సూసైడ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నామని ఓ కహానీ చెప్పాడు. హోటల్‌ సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దాంతో విషయం మొత్తం కక్కేశాడు మనోడు. తానే మర్డర్ చేశానని, ఆత్మహత్య బూటకమని ఒప్పుకున్నాడు. తమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నో చెప్పారని, వారి మాటకే కట్టుబడి ఉంటానని యువతి తనను దూరం పెట్టిందని చెప్పాడు. అందుకే ప్లాన్‌ ప్రకారం ప్రేయసిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని యువతి డెడ్‌బాడీని పోస్ట్‌మార్టంకి పంపించారు పోలీసులు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Teacher-Student: గిదేంది టీచర్ గిట్లా జేశిన్రు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో.. కట్ చేస్తే..

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..