Onion less kachori: కచోరిలో ఉల్లిపాయ లేదని యువతి రచ్చ.. వ్యాపారికి చుక్కలు చూపించిన అమ్మాయి.. వైరల్ అవుతున్న వీడియో
కచోరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. సాయంత్రం వేళ స్నాక్స్‌లాగా ఓ నాలుగు కచోరీలు లాగించేస్తే ఎంత బావుంటుందో కదా. అలాగే అనుకొని ఓ అమ్మాయి ఓ షాపు దగ్గరకు వెళ్లింది. కచోరీ ఆర్డర్ చేసింది. అయితే...
కచోరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. సాయంత్రం వేళ స్నాక్స్‌లాగా ఓ నాలుగు కచోరీలు లాగించేస్తే ఎంత బావుంటుందో కదా. అలాగే అనుకొని ఓ అమ్మాయి ఓ షాపు దగ్గరకు వెళ్లింది. కచోరీ ఆర్డర్ చేసింది. అయితే ఆ కచోరిలోకి ఉల్లిపాయ లేదని నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసింది. కచోరి విక్రయిస్తున్న వ్యక్తిని ఇష్టానుసారంగా తిడుతూ.. అతనితో గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో రోడ్డుపై ఉన్న ఓ పానీపూరి షాప్ దగ్గర ఓ అమ్మాయి కచోరి తింటోంది. అయితే అందులోకి ఉల్లిపాయలు కావాలని ఆ షాప్ వ్యక్తిని అడిగింది.. అతను లేదని చెప్పడంతో ఆ యువతి ఆవేశంతో ఊగిపోయింది. అతడిని ఇష్టానుసారంగా తిడుతూ.. గొడవకు దిగింది. అతనితోపాటు.. అక్కడున్నవారందరూ వద్దని వారిస్తున్నా… ఆ వ్యక్తిపై కోపంతో విరుచుకుపడింది. అంతేకాదు… ఆ కచోరి విక్రయిస్తున్న వ్యక్తి సైకిల్ను తన్నిపారేసింది. దీంతో అందులోని వస్తువులన్ని కిందపడిపోయాయి. అప్పటికీ ఆ యువతి కోపం కంట్రోల్ కాలేదు.. ఆ వ్యక్తిపై చేయికూడా చేసుకుంది. ఈ తతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతుంది. ఇందులోని అమ్మాయి ప్రవర్తన చూసిన నెటిజన్స్.. తనపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

