Vaccine Robot: వ్యాక్సిన్ వేస్తున్న రోబో.. సూది లేకుండా నొప్పి పుట్టకుండా.. వీడియో వైరల్..
కాలంతోపాటూ టెక్నాలజీ కూడా పరుగులు తీస్తోంది. ప్రజలు కూడా టెక్నాలజీకి బాగా అలవాటుపడిపోతున్నారు. గడిచే కొద్దీ టెక్నాలజీని తమ అవసరాలకు తగ్గట్టుగా అన్వయించుకుంటున్నారు.
కాలంతోపాటూ టెక్నాలజీ కూడా పరుగులు తీస్తోంది. ప్రజలు కూడా టెక్నాలజీకి బాగా అలవాటుపడిపోతున్నారు. గడిచే కొద్దీ టెక్నాలజీని తమ అవసరాలకు తగ్గట్టుగా అన్వయించుకుంటున్నారు. ఇందులో రోబోట్ లు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఒక రోబో నర్సుల అవసరం లేకుండా వ్యాక్సిన్ వేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఎక్కడో ఏమిటో చూద్దాం.వాటర్లూ యూనివర్శిటీ కి చెందిన… కెనడా స్టార్టప్ కంపెనీ కోబయోనిక్స్ రెండేళ్ల కిందట కోబీ రోబోను తయారుచేసింది. అప్పటి నుంచి ఈ రోబో రకరకాల పనులు చేస్తోంది. తాజాగా వ్యాక్సిన్ ఇంజెక్షన్ విజయవంతంగా వేసిన మొదటి రోబోగా ఇది గుర్తింపు పొందినట్లు కోబయోనిక్స్ కంపెనీ తెలిపింది. ఈ రోబో సూది లేకుండా ఈ ఇంజెక్షన్ వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆన్‌లైన్‌లో వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు… సంబంధిత లొకేషన్‌కి వచ్చి… రోబో ద్వారా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల చాలా టైమ్ కలిసొస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ రోబోకి టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. అందులో ఇది ఇంజెక్షన్ వేసే ముందు సదరు వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అంటే… నేమ్, మొబైల్ నంబర్, ఫొటో ఐటెంటిటీ వంటివి చెక్ చేసుకుంటోంది. మల్టిపుల్ త్రీడీ డెప్త్ సెన్సార్లతో మనిషిని గుర్తిస్తుంది. ఐడీ అంతా కరెక్టుగా ఉంది అనుకుంటే… అప్పుడు వ్యాక్సిన్ వేస్తోంది.
ఇక్కడ ఇంకో విశేషమేంటంటే.. ఈ రోబోకి ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది. ఆ చెయ్యే వ్యాక్సిన్ వేస్తుంది. దానికి సెన్సార్లు ఉంటాయి. అవి మనిషి చెయ్యిని గుర్తిస్తాయి. అయితే రోబోతో ఇంజెక్షన్ వేయించడం ఎంతవరకు కరెక్ట్ అనే సందేహం మీకు రావచ్చు. ఇందుకు కోబయోనిక్స్ కంపెనీ… ఇదేమాత్రం ప్రమాదకరం కాదు అంటోంది. సూదితో పనిలేకుండా ఇంజెక్షన్ వేస్తోంది కాబట్టి… సమస్య రాదంటోంది. అంతేకాదు… రోబో సెన్సార్లు కరెక్టు ప్రదేశాన్ని చూశాకే… ఇంజెక్షన్ వేస్తుంది కాబట్టి సమస్య ఉండదు అంటోంది. త్వరలోనే ఇలాంటి రోబోలు వ్యాక్సిన్లు వేసే రోజులు త్వరలోనే రావచ్చు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

