సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ

Updated on: Feb 18, 2025 | 6:14 PM

గుజరాత్‌లోని గిర్ అడవి నుండి థ్రిల్లింగ్ గా ఉండే, అరుదైన వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో అడవికి రాజైన ఒక సింహం గాల్లోకి ఎగిరి మరీ పక్షిని వేటాడిన దృశ్యం అందరినీ విస్తుపోయేలా చేసింది. సాధారణంగా సింహాలు... జింకలు, అడవి పంది వంటి అనేక పెద్ద, చిన్న జంతువులను వేటాడతాయి.

అలాంటి వీడియోలు కూడా గతంలో చాలానే చూసుంటారు. కానీ, ఈసారి సింహం గాల్లోకి ఎగిరే పక్షిని పట్టుకోవడం ద్వారా తన చురుకుదనం, బలం ఏ స్థాయిలో ఉంటాయో మరోమారు చాటిచెప్పింది. వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం, సింహాలు ఈ విధంగా వేటాడటం అసాధారణం. ఎందుకంటే అవి ఎక్కువగా నేలపైనే వేటాడతాయి. కానీ, ఈ వీడియో ద్వారా తెలిసింది ఏంటంటే.. అవసరమైనప్పుడు సింహాలు ఏ పరిస్థితిలోనైనా వేటాడగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని. ఈ దృశ్యం వాటి ప్రత్యేకమైన వేట ప్రవృత్తిని చూపిస్తుంది. గిర్ అడవి దాని జీవవైవిధ్యం, ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందేలా చేసింది. ఈ వీడియో వన్యప్రాణుల ప్రేమికులకు చాలా ఉత్తేజకరమైనది. సింహాల బలం, చురుకుదనం, వేట నైపుణ్యాలు.. చాలామందిని ఆకర్షిస్తాయి. ఈ అంశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే ఇలాంటి వీడియోలను ఎక్కువమంది వీక్షిస్తారు. పైగా సింహాల వేటాడే అరుదైన దృశ్యాలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..

బ్రష్‌ చేసిన.. వెంటనే నోరు కడుక్కుంటే ఇంత ప్రమాదమా ??

సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు.. హెల్ప్‌ చేయండి.. ప్లీజ్‌

Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్

Thandel: రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో