Viral: చికెన్‌ కర్రీలో బతికున్న పురుగు.. కస్టమర్‌కు రూ.25 వేలు చెల్లించాలని తీర్పు.

Viral: చికెన్‌ కర్రీలో బతికున్న పురుగు.. కస్టమర్‌కు రూ.25 వేలు చెల్లించాలని తీర్పు.

Anil kumar poka

|

Updated on: Sep 24, 2023 | 10:17 AM

రెస్టారెంట్‌కు వెళ్లిన‌ప్పుడు చాలా మంది ఇష్టంగా ఆర్డ‌ర్ చేసే వంట‌కాల్లో చికెన్ ముందువ‌ర‌స‌లో ఉంటుంది. చికెన్ క‌బాబ్స్‌ నుంచి గ్రేవీస్ వ‌ర‌కూ ఎన్నో చికెన్ వెరైటీస్‌ను రెస్టారెంట్స్‌లో లొట్టలేసుకుంటూ లాగిస్తారు. అయితే చండీఘ‌ఢ్‌లోని ఓ రెస్టారెంట్‌లో మ‌హిళ‌కు చేదు అనుభ‌వం ఎదురైంది.న‌గ‌రంలోని చిల్లీస్ రెస్టారెంట్‌కు ర‌ణ్‌జోత్ కౌర్ అనే మ‌హిళ సెప్టెంబ‌ర్ 14న వెళ్లింది.

రెస్టారెంట్‌కు వెళ్లిన‌ప్పుడు చాలా మంది ఇష్టంగా ఆర్డ‌ర్ చేసే వంట‌కాల్లో చికెన్ ముందువ‌ర‌స‌లో ఉంటుంది. చికెన్ క‌బాబ్స్‌ నుంచి గ్రేవీస్ వ‌ర‌కూ ఎన్నో చికెన్ వెరైటీస్‌ను రెస్టారెంట్స్‌లో లొట్టలేసుకుంటూ లాగిస్తారు. అయితే చండీఘ‌ఢ్‌లోని ఓ రెస్టారెంట్‌లో మ‌హిళ‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. న‌గ‌రంలోని చిల్లీస్ రెస్టారెంట్‌కు ర‌ణ్‌జోత్ కౌర్ అనే మ‌హిళ సెప్టెంబ‌ర్ 14న వెళ్లింది. రెస్టారెంట్‌లో తాను ఆర్డ‌ర్ చేసిన చిపోట్లె చికెన్ రైస్‌లో పురుగు క‌నిపించ‌డంతో ఆమె కంగుతింది. తాను అప్ప‌టికే ఫుడ్‌ను తిన్న త‌ర్వాత మిగిలిన ఆహారంలో బ‌తికున్న పురుగు క‌నిపించింద‌ని కౌర్ వాపోయింది. వెంట‌నే ఆమె మేనేజ‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఫుడ్‌ను ప‌రిశీలించినా పెద్ద‌గా స్పందించ‌లేదు. ఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో తీసేందుకు కౌర్ ప్ర‌య్న‌తించ‌గా రెస్టారెంట్ సిబ్బంది ఆమెను వారించి టేబుల్‌పై నుంచి ఫుడ్‌ను తొల‌గించారు. రెస్టారెంట్ తీరుపై ఆగ్ర‌హంతో మ‌హిళ జిల్లా వినియోగ‌దారుల వివాద ప‌రిష్కార క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించింది. దీంతో స‌దరు రెస్టారెంట్‌పై అధికారులు రూ. 25,000 జ‌రిమానా విధించ‌డంతో పాటు బిల్లు మొత్తాన్ని మ‌హిళ‌కు చెల్లించాల‌ని ఆదేశించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..