Railway Charges: పిల్లలపై బాదుడుతో రైల్వేకు రూ. 2,800 కోట్లు రూపాయల ఆదాయం..
రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా సంపాదించింది. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దరఖాస్తుకు ద సెంటర్ ఫర్ రైల్వే ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్స్ సమాచారం ఇచ్చింది. పిల్లల టిక్కెట్ల చార్జీల ద్వారా రైల్వే శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.560 కోట్లతో ఆదాయం పొందింది. 2016-17 నుంచి 2022-23 వరకు విశ్లేషించిన డాటా ప్రకారం
రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా సంపాదించింది. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దరఖాస్తుకు ద సెంటర్ ఫర్ రైల్వే ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్స్ సమాచారం ఇచ్చింది. పిల్లల టిక్కెట్ల చార్జీల ద్వారా రైల్వే శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.560 కోట్లతో ఆదాయం పొందింది. 2016-17 నుంచి 2022-23 వరకు విశ్లేషించిన డాటా ప్రకారం 3.6 కోట్ల మంది పిల్లలు ప్రత్యేక రిజర్వ్‌డ్ సీట్ ఆప్షన్ పొందకుండా సగం ధర చెల్లించి రైళ్లలో ప్రయాణించగా, 10 కోట్ల మంది పిల్లలు టిక్కెట్‌కు పూర్తి చార్జి చెల్లించి బెర్త్ లేదా సీట్ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. వీరి కారణంగానే రైల్వేకు అధిక మొత్తంలో ఆదాయం సమకూరింది. మొత్తం ప్రయాణించిన పిల్లలలో 70 శాతం మంది పూర్తి చార్జి చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకున్నారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2016లో రైల్వే ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం 5 నుంచి 12 ఏళ్ల పిల్లలు టిక్కెట్ ధరలో సగం చార్జి చెల్లించి ప్రయాణించవచ్చు. అయితే అతనికి సీటు లేదా బెర్త్ కేటాయించరు. అలా కాకుండా వారికి సీటు లేదా బెర్త్ రిజర్వ్ చేసుకోవాలంటే పూర్తి టిక్కెట్ చార్జీ చెల్లించాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

