Woman Sarpanch: దళితుడ్ని చెప్పుతో కొట్టిన మహిళా సర్పంచ్..! నెట్టింట రచ్చగా మారిన సర్పంచ్ వీడియో..
గ్రామ పరిపాలన చూడాల్సిన మహిళ.. దళితుడు అని కూడా చూడకుండా రెచ్చిపోయింది. లబ్ధిదారుల ఎంపిక కోసం లంచం ఇవ్వలేదని, అందరి ముందు ఓ యువకుడిని చెప్పుతో కొట్టడం వివాదంగా మారింది.
నల్లగొండ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్ నిర్వాకంపై ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక విధానంలోని లోపాలను అడ్డుపెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఉదంతమే తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం బజకుంట గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి తనకు లంచం ఇవ్వలేదనే కోపంతో గ్రామ సర్పంచ్ సరితారెడ్డి.. గ్రామస్తుల ముందే లబ్ధిదారుల్ని తన చెప్పుతో కొట్టడం దుమారం రేపుతోంది. గ్రామ పరిపాలన చూడాల్సిన సర్పంచ్ దళితుడని కూడా చూడకుండా చెప్పుతో కొట్టడంపై విపక్షాల నేతలతో పాటు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు సర్పంచ్ చెప్పుతో దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వీడియో తీస్తుండగా వారిపై కూడా విరుచుకుపడింది సర్పంచ్ సరితారెడ్డి. కాగా, సదరు సర్పంచ్‌పై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..