Molestation Murder: కాబోయే భార్యపై అత్యాచారం.. ఆపై ఆత్మహ‌త్య.! ఎందుకంటే..

Molestation Murder: కాబోయే భార్యపై అత్యాచారం.. ఆపై ఆత్మహ‌త్య.! ఎందుకంటే..

Anil kumar poka

|

Updated on: Dec 16, 2022 | 8:37 PM

ఇటీవ‌లే ఆ ఇద్దరికి పెద్దలు పెళ్లి కుదుర్చారు. నిశ్చితార్థం కూడా జ‌రిగింది. మ‌రో ఆరు నెల‌ల్లో పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ అంత‌లోనే కాబోయే భార్యపై అత్యాచారం చేశాడు ఆ యువ‌కుడు.


ఇటీవ‌లే ఆ ఇద్దరికి పెద్దలు పెళ్లి కుదుర్చారు. నిశ్చితార్థం కూడా జ‌రిగింది. మ‌రో ఆరు నెల‌ల్లో పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ అంత‌లోనే కాబోయే భార్యపై అత్యాచారం చేశాడు ఆ యువ‌కుడు. రెండోసారి ఏకంగా ఆ యువ‌తి ఇంటికి వెళ్లే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంత‌రం ఆమె గొంతు నులిమి చంపేశాడు. దీంతో ప‌రువు పోతుందేమోన‌ని భావించి, ఆత్మహ‌త్యగా చిత్రీక‌రించారు యువ‌తి త‌ల్లిదండ్రులు. కానీ, పోలీసుల ఎంక్వైరీలో సంచలన విషయాలు బయటపడటంతో అరెస్టు చేస్తారేమోన‌న్న భ‌యంతో యువ‌కుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ తాలుకా ప‌రిధిలో చోటు చేసుకుంది. రామ‌న‌కొప్ప గ్రామానికి చెందిన యువ‌తితో క‌డ‌లూరు యువ‌కుడికి ఇటీవ‌లే నిశ్చితార్థం జ‌రిగింది. అయితే ఆమె ప్రస్తుతం మైన‌ర్. 18 ఏండ్లు నిండ‌డానికి మ‌రో ఆరు నెల‌ల స‌మ‌యం ఉంది. దీంతో పెళ్లిని ఆరు నెల‌ల పాటు వాయిదా వేశాయి ఇరు కుటుంబాలు. అయితే ఒక రోజు కాబోయే భార్య ఇంటికి వచ్చిన ఆ యువ‌కుడు.. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మ‌రోసారి ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేసిన అనంత‌రం గొంతు నులిమి హతమార్చాడు. దీంతో పరువు పోతుందేమోన‌ని భావించి త‌మ బిడ్డ ఆత్మహ‌త్య చేసుకుంద‌ని త‌ల్లిదండ్రులు నమ్మించారు. విషయం పోలీసుల‌కు తెలియడంతో పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక‌లో ఆమెపై అత్యాచారం జ‌రిగింద‌ని తేలింది. ఇక పోలీసులు త‌న‌ను అరెస్టు చేస్తారేమోన‌నే భ‌యంతో యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 16, 2022 08:37 PM