Corona Vada Viral Video: కరోనా.. పేరు పలికితేనే ఈ మధ్య కాలంలో ఎంతటి వారికైనా ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక 2019 నుంచి ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తూనే ఉంది. ఈ వైరస్ రాకతో మన జీవితాలు కూడా పూర్తిగా మారిపోయాయి. నిజానికి కరోనా వైరస్ (Coronavirus) వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటికీ దాని బంధీఖానాలోనే యావత్తు ప్రపంచం బిక్కు బిక్కు మంటూ జీవిస్తోంది. ఐతే కొందరు ఈసురోమంటూ కాలాన్ని వెల్లదీస్తుంటే.. మరి కొందరేమో కరోనా కష్ట కాలంలో వినూత్నంగా ఆలోచించి విభిన్న పనులకు నాంది పలుకుతున్నారు. ఐతే ఈసారి ఓ గృహిణి మరింత కొత్తగా ఆలోచించి పాక శాస్త్రంలో నూతన ఒడవడికను సృష్టించి.. ఏకంగా కరోనా వడలు (Corona Vada) తయారు చేసింది. కరోనా వడలా? అని హడలెత్తిపోకండి…! కరోనా వడల తయారీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ మధ్య కూడా ఇలాంటివి ప్రయోగం ఒకటి సోషల్ మీడియా (Social Media)లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే! 2020లో కోల్‌కతాకు చెందిన స్వీట్ షాప్ యజమాని కరోనా సందేశ్ స్వీట్ అనే డెజర్ట్‌ను తయారు చేశాడు. ఐతే ప్రస్తుతం మాత్రం ఓ మహిళ కరోనా వడ అనే ఫుడ్ డిష్‌ను చేసింది. బియ్యప్పిండిని మెత్తగా పిసికి, ఆ తర్వాత బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టొమాటోలు, సగ్గుబియ్యంలతో కరోనా వడలు తయారు చేసింది. పిండి లోపల సగ్గుబియ్యాన్ని నింపి, పచ్చి బియ్యంతో పూసి బాగా ఉడికించి, ఆపై నీటిలో నానబెట్టిన బియ్యంతో చుట్టడంతో, అది సరిగ్గా కరోనావైరస్ స్పైక్‌లా కనిపిస్తుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు కూడా. ఇప్పటికే లక్షల్లో వీక్షణలు, వేలల్లో కామెంట్లతో ఈ వీడియో వైరలయ్యింది.
Corona vada! Bharat ki naari sab par bhaari! .@arindam75 pic.twitter.com/sf1zoLPih2
— Mimpi? (@mimpful) January 19, 2022
Also Read: