మొబైల్ చూస్తూ ట్రైన్ నడిపిన మహిళ.. తరువాత ??
చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మొబైల్‌కు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎంతగా అంటే చిన్నపిల్లలకు అన్నం పెట్టాలంటే చేతికి మొబైల్ ఇవ్వాల్సిందే.. లేదంటే వాళ్లు తినరు.. అలాగే వాకింగ్ చేసినా మొబైల్ ఉండాలి.. వంట చేసినా మొబైల్ ఉండాలి. సందర్భం ఏదైనా ఫోన్ కామన్..
చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మొబైల్‌కు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎంతగా అంటే చిన్నపిల్లలకు అన్నం పెట్టాలంటే చేతికి మొబైల్ ఇవ్వాల్సిందే.. లేదంటే వాళ్లు తినరు.. అలాగే వాకింగ్ చేసినా మొబైల్ ఉండాలి.. వంట చేసినా మొబైల్ ఉండాలి. సందర్భం ఏదైనా ఫోన్ కామన్.. దాంతో ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ లోకోపైలట్ మొబైల్ చూస్తూ ట్రైన్ నడిపింది. అనేకమందిని ప్రమాదంలో పడేసింది. రష్యాలో ఓ మహిళా లోకో పైలట్ మొబైల్ ఫోన్ చూస్తూ రైలు నడుపుతోంది. రైలు ముందుకెళ్తుంటే లోకో పైలట్ చుట్టూ గమనించకుండా ఫోన్‌లో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తుంది. ఈ రైలు వెళ్తున్న ట్రాక్‌పైనే మరో రైలు ఆగి ఉంది. మహిళ ఫోన్‌లో బిజీగా ఉండడంతో ముందు ఆగిఉన్ రైలును చూడలేదు. దగ్గరికి వచ్చేసాక గమనించింది. ఎదురుగా రైలు సి బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా.. అప్పటికే సమీపానికి చేరుకోవడంతో సాధ్యం కాలేదు. రైలు నేరుగా వెళ్లి ఆగి ఉన్న రైలును ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా సీట్లలో నుంచి ఎగిరి పడ్డారు. అయితే రైలుకు సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఉండడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఈ దృశ్యాలన్నీ రైలులోని సీసీటీవీ ఫుటేజీలోరికార్డయ్యాయి. అయితే రైలులో ఎక్కువ ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కాగా ఈఘటన 2019 అక్టోబర్‌లో చోటుచేసుకుంది. తాజాగా ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ మళ్లీ షేర్ చేయడంతో మరోసారి వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 10 మిలియన్ల మంది చూశారు. లోకోపైలట్ నిర్లక్ష్యానికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వంతెనపై ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ !! ఏంజరిగిందంటే ??
బైక్‌పై వస్తారు.. పుటుక్కున తెంచేస్తారు !! రోడ్డుమీదే కాదు ఇళ్లలోనూ !!
లగేజ్‌తో వెళ్తూ కిందపడిపోయిన వ్యక్తి !! ఆ తర్వాత..
రెండేళ్ల చిన్నారికి అరుదైన గుర్తింపు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో..
సింహం బారినుంచి ఆవులమందను కాపాడిన కుక్క !!