AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చి పీక్స్‌ అంటే ఇదే.. భర్తపై అమితమైన ప్రేమ.. ఆ మహిళ ఏంచేసిందో చూడండి..

పిచ్చి పీక్స్‌ అంటే ఇదే.. భర్తపై అమితమైన ప్రేమ.. ఆ మహిళ ఏంచేసిందో చూడండి..

Phani CH
|

Updated on: May 30, 2023 | 9:37 PM

Share

భార్యభర్తల ప్రేమానురాగాలు బ్లాక్‌ అండ్‌ వైట్ సినిమాల్లోనో.. నవలల్లోనో అందంగా ఉంటాయి. నిజజీవితంలో సీన్‌ వేరేలా ఉంటుంది. టామ్‌ అండ్‌ జెర్రీలా నిత్యం కీచులాడుకుంటుంటారు. ప్రేమలు.. పెళ్లిళ్లు.. పెటాకులు అన్నీ నూడిల్స్‌ వండినంత సులువుగా అయిపోతున్నాయ్. ఐతే, కొందరు నిజంగానే అన్యోన్యంగా ఉంటారు

భార్యభర్తల ప్రేమానురాగాలు బ్లాక్‌ అండ్‌ వైట్ సినిమాల్లోనో.. నవలల్లోనో అందంగా ఉంటాయి. నిజజీవితంలో సీన్‌ వేరేలా ఉంటుంది. టామ్‌ అండ్‌ జెర్రీలా నిత్యం కీచులాడుకుంటుంటారు. ప్రేమలు.. పెళ్లిళ్లు.. పెటాకులు అన్నీ నూడిల్స్‌ వండినంత సులువుగా అయిపోతున్నాయ్. ఐతే, కొందరు నిజంగానే అన్యోన్యంగా ఉంటారు అది వేరే విషయం. భార్యకు భర్తమీద.. భర్తకు భార్య మీద ఉన్న ప్రేమను చాటుతూ ఒకరినొకరు వారికి నచ్చిన వస్తువులు తెచ్చివ్వడమో, ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లడమో చేస్తారు. కానీ ఇక్కడ ఓ మహిళ ఒకడుగు ముందుకేసి మహిళలందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఏంచేసిందంటే. ఈ మహిళ తన తన భర్తపై తనకున్న ప్రేమను తెలియచేయడానికి ఏకంగా పతిదేవుడి పేరును తన నుదుటిపై పచ్చబొట్టు వేయించుకుంది. మీరు విన్నది కరెక్టే.. పచ్చబొట్టే.. నుదటిమీదే… బెంగళూరుకు చెందిన టాటూ ఆర్టిస్ట్ ఓ మహిళ నుదుటిపై ఆమె భర్త పేరును టాటూ వేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియోకు క్లిప్‌కు మిలియన్లలో వ్యూస్‌.. లక్షల్లో లైక్స్ రావడంతో వైరల్ అయ్యింది. నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘నీకు పిచ్చా.. ప్రేమ హద్దులులేనిది. దానిని చూపాల్సిన పనిలేదు’ అని ఒకరు, ‘దీనిని ప్రేమ అనరు పిచ్చి పీక్స్‌ అంటారు’ అని మరొకరు, ‘ఇది కచ్చితంగా ఫేక్‌’ అని ఇంకొకరు కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ వీడియోలో ఉన్న మహిళను చాలా రీల్స్‌ చేసింది. ఈ వీడియోల్లో ఆమె నుదిటి భాగం క్లీన్‌గా ఉంది. కాబట్టి అది పచ్చబొట్టు కాదు నకిలీ అని అసలు విషయం తెల్చేశారు. ఏది ఏమైనా.. నిజం ఒప్పుకోవాల్సిందే. భాగస్వామి పేరు నుదుటిపై పచ్చబొట్టు వేయించుకునేంత ప్రేమ అసాధ్యం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారు బ్యానెట్‌పై కూర్చుని యువతి రీల్స్‌.. తర్వాత ఏం జరిగింది ??

తిమింగలం వాంతి .. రూ. 30 కోట్లు.. దానికి ఎందుకంత డిమాండ్‌ ??

విమాన ప్రయాణీకుడికి ఊహించని అనుభవం.. ఆకాశంలో అద్భుత దృశ్యం

Bhola Shankar: ఇక భోళా శంకర్ మేనియా షురూ.. ఫ్యాన్స్ కు పండగే పండగ

Allu Arjun: అందరిముందు తన ఫస్ట్ గర్ల్‌ ఫ్రెండ్ పేరు చెప్పేసిన బన్నీ

 

Follow Us