తిమింగలం వాంతి .. రూ. 30 కోట్లు.. దానికి ఎందుకంత డిమాండ్ ??
తమిళనాడులో వేల్ అంబర్‌గ్రీస్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టుటికోరిన్ బీచ్ వద్ద డీఆర్‌ఐ నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. వారి నుంచి 18.1 కిలోల బరువున్న తిమింగలం వాంతిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ 31.6 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటుందని..
తమిళనాడులో వేల్ అంబర్‌గ్రీస్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టుటికోరిన్ బీచ్ వద్ద డీఆర్‌ఐ నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. వారి నుంచి 18.1 కిలోల బరువున్న తిమింగలం వాంతిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ 31.6 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటుందని డీఆర్‌ఐ పేర్కొంది. అంబర్‌గ్రీస్‌ను ఫ్లోటింగ్ గోల్డ్‌గా పిలుస్తుంటారు. దీన్ని సుగంధ పరిమళాల తయారీలో వినియోగిస్తుంటారు. దాంతో మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంటుంది. సముద్రంలో తేలియాడే అంబర్‌గ్రిస్ అప్పుడప్పుడు కొందరికి దొరుకుతుంది. మైనంలా ఉండే ఈ పదార్థం తిమింగలాల జీర్ణవ్యవస్థలో సహజసిద్ధంగా తయారవుతుంది. చాలా మంది దీన్ని తిమింగలం వాంతి అంటారు. దీనికి ఘాటైన మట్టి వాసనతో పాటు సముద్రపు వాసన సైతం ఉంటుంది. స్వచ్ఛత, నాణ్యతను బట్టి ఈ అంబర్‌గ్రిస్ కిలో 1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అత్యంత అరుదుగా లభిస్తుండడంతో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ ధర పలుకుతుందని అధికారులు పేర్కొంటున్నారు. సెంట్లు, పర్ఫ్యూమ్‌లు, ఇతర సుగంధ పరిమళాల తయారీలో అంబర్‌గ్రిస్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రాచీన సంస్కృతిలో దీన్ని ఆహారంలో రుచి కోసం కూడా వాడేవారట. మద్యం, పొగాకుతో కలిపి కూడా ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమాన ప్రయాణీకుడికి ఊహించని అనుభవం.. ఆకాశంలో అద్భుత దృశ్యం
Bhola Shankar: ఇక భోళా శంకర్ మేనియా షురూ.. ఫ్యాన్స్ కు పండగే పండగ
Allu Arjun: అందరిముందు తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన బన్నీ
TOP 9 ET News: అంతా అబద్దమే నమ్మొద్దు | ఉస్తాద్ పొలిటికల్ వార్
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

