Odisha: విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

|

May 06, 2024 | 11:11 AM

ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు చోటచేసుకుంటున్నాయి. డోర్లు ఊడిపడటం, ఇంజిన్లలో సాంకేతిక లోపం ఇలా ఎక్కడో అక్కడ ఏదొక ప్రమాదం చోటుచేసుకుంటున్న ఘటనలు నెట్టింట చూస్తున్నాం. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే విమానం రెక్కలు దెబ్బ తినడంతో వెంటనే ఫ్లైట్‌ ల్యాండ్‌ చేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి 170 మంది ప్రయాణికులతో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఢిల్లీకి బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని గాలివానతో వడగళ్లు పడడంతో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. అది గమనించిన పైలట్‌ అప్రమత్తమయ్యారు. వెంటనే భువనేశ్వర్‌ విమానాశ్రయం అధికారులకు సమాచారమిచ్చి, రన్‌వేపై విమానాన్ని దించేశారు. దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్‌ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందన్నారు విమానాశ్రయం సంచాలకుడు ప్రసన్న ప్రధాన్‌. ప్రయాణికులను విస్తారా సంస్థకు చెందిన మరో విమానంలో ఢిల్లీ పంపించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.