బాబా వంగా జోస్యం.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? వీడియో
బాల్కన్ల నోస్ట్రడామస్ గా పేరొందిన బల్గేరియాకు చెందిన బాబా వంగా జోస్యాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం, కోవిడ్-19 వంటి ఎన్నో ఘటనలను ఆమె ముందే ఊహించారని నమ్ముతారు. 1996లోనే ఆమె మరణించినప్పటికీ, ఆమె చెప్పిన భవిష్యవాణిపై ఆసక్తి ఇప్పటికీ కొనసాగుతోంది. 2026లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని ఆమె వేసి అంచనా నిజమవుతోందా అనిపిస్తోంది. ప్రపంచ దేశాలమధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ 2026 ప్రారంభమైంది. ఈ క్రమంలో 2026ను బాబాంగా విధ్వంసకర సంవత్సరంగా అంచనా వేశారు. ఇరాన్‌లో, వేలాది మంది పౌరులు ప్రస్తుతం తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. వెనిజులా విషయానికొస్తే, అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించింది.
అమెరికాలో ఉన్నప్పుడు, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 57,000 జనాభా కలిగిన స్వయంప్రతిపత్త డానిష్ భూభాగమైన గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోవాలనే ఆలోచనను బయటపెట్టారు. భౌగోళిక రాజకీయ వివాదాలు కొనసాగుతున్నప్పటికీ, బాబా వంగా యొక్క అనేక అంచనాలు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశాలపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాడులు ఒకవైపు .. రష్యా, చైనాను కంట్రోల్ చేసేందుకు ట్రంప్ దూకుడు మరోవైపు.. తాజాగా రష్యా జెండా ఉన్న షిప్‌ను అమెరికా సీజ్ చేయడం.. దాడులకు సిద్ధంగా ఉండాలని రష్యా వార్నింగ్ వంటి పరిణామాలు.. మూడో ప్రపంచయుద్ధానికి సంకేతాలు ఇస్తున్నాయనిపిస్తోంది. కొత్త ఏడాది జనవరి 3న వెనిజులా రాజధాని కరాకస్‌పై అమెరికా జరిపిన ఆకస్మిక వైమానిక దాడులతో రష్యా, చైనాకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. లాటిన్ అమెరికాలో మొదలైన ఈ చిచ్చు ప్రపంచ శాంతికి సవాలుగా మారింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా జైలులో బంధించాడు ట్రంప్. అమెరికా నిప్పుతో చెలగాటం ఆడుతోందని చైనా హెచ్చరించింది.
మరిన్ని వీడియోల కోసం :
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
