Tiger Plastic: పులి చెబుతున్న గుణపాఠం! మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా?

|

Feb 18, 2024 | 12:22 PM

ఇందుగలదు అందు లేదు..అన్నట్టు సర్వత్రా వ్యాపించిన ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రస్తుతం సంక్షోభ స్థాయికి చేరుకుంది. మనుషుల తప్పిదానికి జంతువులు కూడా బలవుతున్నాయి. తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలను తింటూ మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియో నెటిజన్లను అమితంగా కదిలిస్తోంది. పులి చెబుతన్న ఈ గుణపాఠాన్ని మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా? అన్న నిర్వేదం వ్యక్తమవుతోంది.

ఇందుగలదు అందు లేదు..అన్నట్టు సర్వత్రా వ్యాపించిన ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రస్తుతం సంక్షోభ స్థాయికి చేరుకుంది. మనుషుల తప్పిదానికి జంతువులు కూడా బలవుతున్నాయి. తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలను తింటూ మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియో నెటిజన్లను అమితంగా కదిలిస్తోంది. పులి చెబుతన్న ఈ గుణపాఠాన్ని మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా? అన్న నిర్వేదం వ్యక్తమవుతోంది. అడవి లోని నీటి మడుగు నుంచి ప్లాస్టిక్ బాటిల్‌ను నోటితో పట్టుకుని పులి వస్తున్న దృశ్యం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కథికార్ ఈ అరుదైన సంఘటనను తన కెమెరాలో బంధించ గలిగారు. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లోని రామ్‌డేగి కొండల్లో భానుష్కిండి అనే పులి కూన ఈ విధంగా ప్లాస్టిక్ సీసాను పట్టుకు వస్తోందని ఫోటో గ్రాఫర్ వివరించారు. ఈ ఫోటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫిబ్రవరి 13 న షేర్ చేశారు. ‘పులి అందించిన మధుర సంకేతం’ అన్న శీర్షిక పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను దాదాపు 21 వేల మంది వీక్షించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అడవులను పరిశుభ్రం చేసుకోవాలన్న సందేశం వినిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..