Viral Video: భర్త ఎదుటే కింద పడిన భార్య.. పట్టించుకోకుండా ఏంచేస్తున్నాడో తెలుసా? వైరలవుతోన్న వీడియో

|

Aug 07, 2021 | 5:25 AM

భార్యాభర్తల వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని భావోద్వేగంతో నిండి ఉంటే.. మరికొన్ని ఫుల్‌గా నవ్వించేవిగా ఉంటాయి. తాజాగా నెట్టింట్లో సందడి చేస్తున్న ఓ వీడియోను చూస్తే..

Viral Video: భర్త ఎదుటే కింద పడిన భార్య.. పట్టించుకోకుండా ఏంచేస్తున్నాడో తెలుసా? వైరలవుతోన్న వీడియో
Hubby
Follow us on

Viral Video: భార్యాభర్తల వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని భావోద్వేగంతో నిండి ఉంటే.. మరికొన్ని ఫుల్‌గా నవ్వించేవిగా ఉంటాయి. తాజాగా నెట్టింట్లో సందడి చేస్తున్న ఓ వీడియోను చూస్తే.. పగలబడి నవ్వుతారనడంలో సందేహం లేదు. ఇలాంటివి అప్పుడప్పుడు ప్రతీ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. వీడియోలో ఏముందంటే.. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతీఒక్కరి అవసరంగా మారింది. పిల్లలు లేదా పెద్దలు తమ ఫోన్‌లలో నిమగ్నమై పక్కన ఏంజరుగుతుందో కూడా పట్టించుకోకుండా ఉండడం మనం తరుచుగా చూస్తూనే ఉన్నాం. ఈ వీడియోలోనూ అచ్చం అలాంటి భర్తనే చూస్తాం. ఫోన్లో లీనమై తన చుట్టూ ఏంజరుగుతుందో తెలియని ఓ భర్త… తన భార్య కింద పడిపోయినా పట్టించుకోకపోవడం నెటిజన్లకు నవ్వుతెప్పిస్తోంది. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక వ్యక్తి తన ఇంట్లో కుర్చీపై కూర్చుని ఫోన్లో లీనమయ్యాడు. ఆ సమయంలో అతని భార్య నడుచుకుంటూ వస్తోంది. అతని ముందు ఉన్న కుర్చి తగిలి అకస్మాత్తుగా కిందపడిపోతుంది. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఆమె కిందపడిపోయినా కూడా ఆ వ్యక్తి అస్సలు పట్టించుకోకుండా తన ఫోన్‌లో బిజీగా ఉండడం. ఈ ఘటన ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయింది. వీరి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియో బెస్ట్ వీడియోల పేరుతో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ఆశ్చర్యపోవడం నెటిజన్ల వతైంది. ఈ వీడియోను షేర్ చేయడమే కాకుండా దీనిపై రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.భార్యాభర్తల మధ్య గొడవ జరుగిందని ఒకరంటే, భార్య గాయపడినప్పుడు భర్త ఎలాంటి రియాక్షన్ ఇవ్వడంటూ మరొకరు కామెంట్ చేశారు. పెరుగుతున్న మొబైల్ ఫోన్ వ్యసనంపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Tokyo Olympics 2020: రెఫరీపై దాడి.. భారత రెజ్లర్ దీపక్ పునియా కోచ్‌పై వేటు.. డబ్ల్యూఎఫ్‌ఐని హెచ్చరించిన ఐవోసీ

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో నేడే భారత్‌కు చివరిరోజు.. పతకాల సంఖ్య పెరిగేనా? భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్