Rights on Moon: చంద్రుడి వనరులపై హక్కులు ఎవరివి? ఐరాస ఎం చెప్తుంది..?

|

Aug 26, 2023 | 9:58 PM

చందమామపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగి, వరుసగా వ్యోమనౌకలను పంపుతున్న నేపథ్యంలో.. ఆ ఖగోళ వస్తువు, అక్కడి వనరులపై హక్కులు ఎవరివి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై అంతర్జాతీయ చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. జాబిల్లి మానవాళి మొత్తానిది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి 1966లో ఐరాస.. ఔటర్‌ స్పేస్‌ ట్రీటీని తీసుకొచ్చింది. దీని ప్రకారం చందమామ, ఇతర ఖగోళ వస్తువులపై ఏ దేశమూ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు. అన్ని దేశాల ప్రయోజనం కోసం ఖగోళ అన్వేషణ జరగాలి.

చందమామపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగి, వరుసగా వ్యోమనౌకలను పంపుతున్న నేపథ్యంలో.. ఆ ఖగోళ వస్తువు, అక్కడి వనరులపై హక్కులు ఎవరివి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై అంతర్జాతీయ చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. జాబిల్లి మానవాళి మొత్తానిది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి 1966లో ఐరాస.. ఔటర్‌ స్పేస్‌ ట్రీటీని తీసుకొచ్చింది. దీని ప్రకారం చందమామ, ఇతర ఖగోళ వస్తువులపై ఏ దేశమూ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు. అన్ని దేశాల ప్రయోజనం కోసం ఖగోళ అన్వేషణ జరగాలి. అయితే ఈ ఒప్పందంలో అయా దేశ ప్రభుత్వాల ప్రస్తావనే ఉంది. చందమామలోని ఏదైనా ప్రాంతంపై హక్కులను ప్రకటించుకోవచ్చా అన్నదానిపై స్పష్టతలేదు.

ఈ నేపథ్యంలో 1979లో మూన్‌ అగ్రిమెంట్‌ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం ఏ ప్రభుత్వ, అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు చందమామను తమ ఆస్తిగా ప్రకటించుకోకూడదు. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని, జాబిల్లి మాదే అనడం చెల్లదు. చందమామ, అక్కడి సహజవనరులు మానవాళి ఉమ్మడి సొత్తు. ఈ ఒప్పందం 1984లో అమల్లోకి వచ్చింది. అయితే చందమామపైకి ల్యాండర్లు పంపిన అమెరికా, రష్యా, చైనా మాత్రం ఇంకా ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు. అంతరిక్ష ఒప్పందానికి కొనసాగింపుగా అమెరికా 2020లో అర్టెమిస్‌ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. చందమామపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడం దీని ఉద్దేశం. ఇందులో కెనడా, జపాన్‌, ఐరోపా తదితర దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. భారత్‌ కూడా ఇటీవల ఇందులో చేరింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...