Heavy Rains: బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు మళ్లీ వర్షాలు..!

Heavy Rains: బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు మళ్లీ వర్షాలు..!

Anil kumar poka

|

Updated on: Aug 26, 2023 | 9:54 PM

తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన మోసుకొచ్చింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని,

తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన మోసుకొచ్చింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని మేడ్చల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగామ, భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...