Telangana: రెచ్చిపోయిన పోకిరీలు.. నువ్వు ఎస్ఐ అయితే మాకేంటి.. చితకబాదిన పోకిరీలు..!
యూనిఫాంలో ఉన్న ఎస్సైపై పోకిరీ యువకులు రెచ్చిపోయారు. విచక్షణ కోల్పోయి దాడి చేశారు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. బాలానగర్ ఎస్వోటీ ఎస్సైగా పనిచేస్తున్న కిషోర్‌పై నలుగురు యువకులు దాడికి తెగబడ్డారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మేడ్చల్ నుండి కొంపల్లి వైపు సర్వీస్ రోడ్డులో వెళ్తున్న ఎస్ఐ కారును ఒక యువకుడు అడ్డగించాడు.
యూనిఫాంలో ఉన్న ఎస్సైపై పోకిరీ యువకులు రెచ్చిపోయారు. విచక్షణ కోల్పోయి దాడి చేశారు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. బాలానగర్ ఎస్వోటీ ఎస్సైగా పనిచేస్తున్న కిషోర్‌పై నలుగురు యువకులు దాడికి తెగబడ్డారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మేడ్చల్ నుండి కొంపల్లి వైపు సర్వీస్ రోడ్డులో వెళ్తున్న ఎస్ఐ కారును ఒక యువకుడు అడ్డగించాడు. అనవసరంగా కారు ఆపే ప్రయత్నం చేసి.. ఎస్సైని దబాయించాడు. దీంతో కార్ పక్కకు ఆపి దుర్భాషలాడుతున్న యువకుడిని ఎస్సై కిషోర్ ప్రశ్నించారు. దీంతో మరింత రెచ్చిపోయిన యువకుడు వీరంగం సృష్టించాడు. అంతేకాదు తన స్నేహితులను పిలిచిన యువకుడు ఒక్కసారిగా ఎస్ఐపై దాడికి తెగబడ్డారు. ఎస్ఐ సెల్‌ఫోన్ తో పాటు ఐడి కార్డును లాక్కుని దాష్టీకానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

