రూ.40 వేల కోట్ల ఆస్తిని వదిలి బౌద్ధ సన్యాసిగా..

|

Dec 03, 2024 | 7:08 PM

రాబిన్ శర్మ.. జులియన్ మాంటెల్ వంటి వారు జీవితం అంటే ఇంకేదో ఉందని తమ సర్వస్వాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఇప్పుడు మీరు చూడబోయే యువకుడు. తన తండ్రి దేశంలోనే అత్యంత ధనికుల్లో మూడోవాడు. తల్లివైపు చూస్తే రాజ కుటుంబం. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి, లెక్కలేనన్ని వ్యాపారాలు, నిత్యం విందులు వినోదాలతో సాగిపోయే జీవితం.

కానీ, విలాసాలు క్షణికానందమేనని భావించాడు. బౌద్ధ భిక్షువులను చూసి సరదాగా సన్యాసిగా మారిన అతడికి అందులోనే నిజమైన ఆనందం ఉందని తెలుసుకున్నాడు. దీంతో 40 వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని వదిలి శాశ్వతంగా సన్యాసం స్వీకరించాడు. నిత్యం జోలె పట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు. అతడే మలేషియాలో మూడో అతిపెద్ద బిలియనీర్, భారత సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్ ఏకైక కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యో. అజాన్ 20 ఏళ్ల కిందట 18 ఏళ్ల వయసులో థాయ్ రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు థాయిలాండ్ వెళ్లారు. ఆ పర్యటనే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడి బౌద్ధ భిక్షువులను చూసి ప్రేరణ పొందాడు. సరదా కోసం తానూ సన్యాసిగా మారాలనుకున్నాడు. కానీ, నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడై.. ఏకంగా రూ. 40 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు. తన ఆధ్యాత్మిక మార్గానికి ఇవన్నీ అడ్డుగా భావించిన అజాన్ ఇంటి నుంచి దూరంగా వచ్చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి వైర్లు పట్టుకుని ఊగిన మహిళ

దోమల బాధ ఉందా ?? ఈ మొక్కలు పెంచి చూడండి

BSNL లో మరో అదిరిపోయే ప్లాన్‌.. రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ.. ఇంకా

జీతం పెంచని యజమాని.. ఉద్యోగి చేసిన పనికి అంతా షాక్