Viral Video: అంతరిక్షంలో తడి టవల్‌ను పిండితే ఏమవుతుందో తెలుసా.? ఈ వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి..

|

Jun 25, 2022 | 8:35 AM

Viral Video: పైకి విసిరిన వస్తువు నేలపై తిరిగి పడడానికి గురుత్వారక్షణ శక్తి (గ్రావిటీ) కారణమనే విషయం తెలిసిందే. వస్తువు బరువు తెలియడానికి కూడా ఈ శక్తే కారణం. మరి గ్రావిటీ లేని చోట పరిస్థితి ఏంటి.? వస్తువులన్నీ గాల్లో తేలాల్సిందే...

Viral Video: అంతరిక్షంలో తడి టవల్‌ను పిండితే ఏమవుతుందో తెలుసా.? ఈ వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి..
Viral Video
Follow us on

Viral Video: పైకి విసిరిన వస్తువు నేలపై తిరిగి పడడానికి గురుత్వారక్షణ శక్తి (గ్రావిటీ) కారణమనే విషయం తెలిసిందే. వస్తువు బరువు తెలియడానికి కూడా ఈ శక్తే కారణం. మరి గ్రావిటీ లేని చోట పరిస్థితి ఏంటి.? వస్తువులన్నీ గాల్లో తేలాల్సిందే. చివరికి నీటి బిందువులు కూడా గాల్లోనే తేలుతాయి. అంతరిక్షంలో వ్యోమగాములు నివసించే స్పేస్‌ స్టేషన్‌లో పరిస్థితులు ఇలానే ఉంటాయి. ఆహారం తినాలన్నా, నీరు తాగాలన్నా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. స్పేస్‌ స్టేషన్‌లో వ్యోమగాములకు సంబంధించిన వీడియోలను తరచూ విడుదల చేస్తుంటారు. ఈ వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన క్రిస్‌ హాడ్‌ఫీల్డ్‌ అనే వ్యోమగామికి చెందిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్పేస్‌ స్టేషన్‌లో ఒక తడి గుడ్డను పిండితో ఏమవుతుందో తెలిపేందుకు ఈ వీడియోను రూపొందించారు. గురుత్వాకర్షణ శక్తి లేని కారణంగా టవల్‌ను పిండినా ఒక్క నీటి చుక్క కూడా కింద పడదు. అంతేకాకుండా టవల్‌ చుట్టూ నీరు గాల్లో తేలుతుండడం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. నిజానికి ఈ వీడియో 2013లో చిత్రీకరించినదే అయినప్పటికీ తాజాగా మరోసారి ట్విట్టర్‌లో సందడి చేస్తోంది. మరి ఈ ఆసక్తికర వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..