కొత్త బైక్ కొన్న ఆనందంలో భర్త చేసిన పనికి అంతా షాక్ !! నెట్టింట నవ్వులు పూయిస్తున్న భార్యా భర్తల వీడియో

Phani CH

Phani CH |

Updated on: Oct 22, 2022 | 9:47 AM

మనల్ని నవ్వించే కంటెంట్‌కు ఇంటర్నెట్‌లో ఏ కొరతా లేదు. సోషల్ మీడియా నిండా అనేక వైరల్‌ వీడియోలు, ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని షాక్‌ అయ్యేలా చేస్తాయి.

మనల్ని నవ్వించే కంటెంట్‌కు ఇంటర్నెట్‌లో ఏ కొరతా లేదు. సోషల్ మీడియా నిండా అనేక వైరల్‌ వీడియోలు, ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని షాక్‌ అయ్యేలా చేస్తాయి. దానిని నిరూపించేలా ఇక్కడ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో క్లిప్‌లో.. ఒక కుటుంబం ఓ కొత్త మోటర్‌ బైక్ కొనుగోలు చేసేందుకు షోరూమ్‌కు వచ్చింది. వాహనానికి అప్పటికే రిబ్బన్ కట్టి ఉంచారు. సేల్స్ మాన్ దాని కోసం ఒక దండను కూడా సిద్ధం చేశాడు. బైక్‌ కొనుగోలు చేసిన యజమాని, అతని భార్య ఆ దండ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఉండగానే సిబ్బంది అతని భార్యను మోటార్‌సైకిల్‌ పక్కగా నిలబడి పోజులివ్వమని అడిగాడు. సేల్స్ మాన్ పూల దండను ఆ వ్యక్తికి అందించిన వెంటనే అతడు దానిని తన భార్య మెడలో వేయడానికి ముందుకొచ్చాడు. నిజంగా ఇది ఓ మధుర క్షణంగానే చెప్పాలి. దాంతో ఆ మహిళ..సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకుంటోంది. వెంటనే తేరుకున్న ఆమె.. ఆ దండ నాకు కాదు వేయాల్సింది.. బైక్‌కు అని చెప్పడంతో.. అతను బైక్ కు పూలమాల వేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోళ్ల వ్యాన్ బోల్తా.. వరి పొలం అని కూడా చూడ్లేదు.. ఈ జనాలను చూడండి

ఈ పోటీలో గెలిచిన అమ్మాయిలకు బహుమతిగా ఎన్నారై పెళ్లికొడుకు !!

విద్యార్ధినిని 500 మీటర్లు ఈడ్చుకుపోయిన ఆటోడ్రైవర్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో.. గంటన్నరలో రూ. 70 లక్షలు

News Watch: గులాబీ పార్టీలోకి వలసల జోరు మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu