మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
మొంత తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దిగువ ట్రోపో ఆవరణంలో గాలులు, ఉపరితల చక్రవాత ఆవర్తనం దీనికి కారణం. పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది.
మొంత తుఫాను ఏపీని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. పలు జిల్లాలు నీటమునగడంతో పాటు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొంత తుఫాను శాంతించినప్పటికీ, దాని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి.
వైరల్ వీడియోలు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
