ఆ డాక్యుమెంటరీలు చూస్తే 1.8 లక్షల జీతం !! ఎవరికి అవకాశమంటే ??
మీలో చాలామందికి వెబ్‌సిరీస్‌లు అంటే ఇష్టముండొచ్చు. జోనర్ ఏదైనా గంటల తరబడి చూస్తుంటే.. ఈ ఆఫర్ మీకోసమే. ఓ స్ట్రీమింగ్ సర్వీస్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.
మీలో చాలామందికి వెబ్‌సిరీస్‌లు అంటే ఇష్టముండొచ్చు. జోనర్ ఏదైనా గంటల తరబడి చూస్తుంటే.. ఈ ఆఫర్ మీకోసమే. ఓ స్ట్రీమింగ్ సర్వీస్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. 24 గంటలు ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలు చూస్తే లక్షల్లో జీతం ఇస్తుంది. అసలు ట్రూ క్రైమ్ అంటే ఏంటో తెలుసా.? నిజ జీవితంలో జరిగే నేరాలను ట్రూ క్రైమ్స్ అని అంటారు. కొందరు వీటిని ఆధారంగా చేసుకుని మూవీస్ తీసుకుంటే.. మరికొందరు డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇక ఇలాంటి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలను ప్రజలకు చేరేసేందుకు ఓ స్ట్రీమింగ్ సర్వీస్ అద్భుతమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. అది అలాంటి.. ఇలాంటి ఆఫర్ కాదండోయ్.. భారీ ఆఫర్ అని చెప్పాలి. తమ స్ట్రీమింగ్ సర్వీస్‌లో ప్రసారమయ్యే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలను 24 గంటలు చూసినవారికి 1.8 లక్షలు జీతంగా ఇస్తామని ఆఫర్ ప్రకటించింది.
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos